తెలంగాణ

telangana

ETV Bharat / city

'సాగు కూలీలకూ రైతు బీమా వర్తింపుపై నిర్ణయం తీసుకుంటాం' - minister niranjan reddy about rythu bheema

సాగు కూలీలకూ రైతుబీమా పథకాన్ని వర్తింపజేయడం విధానపరమైన అంశమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. త్వరలోనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

niranjan reddy, agriculture minister
నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

By

Published : Mar 26, 2021, 12:10 PM IST

రాష్ట్రంలో ఇప్పటివరకు 45 వేల మందికిపైగా రైతులకు రైతు బీమా పథకం అమలు చేసినట్లు శాసనమండలిలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. కేవలం ఐదారు రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు.

నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

రైతు బీమా పథకాన్ని... రైతు కూలీలకూ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని మండలి సభ్యులు జీవన్‌రెడ్డి కోరారు. నిరుపేద కూలీలకు ప్రభుత్వం నుంచి అండగా నిలవాలని కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. సాగు కూలీలకూ బీమా పథకాన్ని వర్తింపజేయడం విధానపరమైన అంశమన్న మంత్రి నిరంజన్‌రెడ్డి... త్వరలోనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details