KTR Tweet Today : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా భాజపా నేతలు, ప్రధాని మోదీ, కేంద్ర సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ ద్రవ్యోల్బణాన్ని, చొరబాటును నియంత్రించలేక పోతున్నారని విమర్శించారు. అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా రెండో గ్రామాన్ని నిర్మించిందని.. శాటిలైట్ ఫొటోలతో మీడియా ప్రచురించిన కథనాలను కేటీఆర్ పోస్ట్ చేశారు.
KTR Tweet Today : ఇలాంటి ప్రధానిని ఏమని పిలవాలి..? - మోదీని విమర్శిస్తూ కేటీఆర్ ట్వీట్
KTR Tweet Today : తరచూ ట్విటర్ వేదికగా కేంద్ర సర్కార్ విధానాలు, ప్రధాని మోదీపై విరుచుకుపడే రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి వారిపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీని ఏమని పిలుస్తారని నాలుగు ఆప్షన్లను ట్వీట్ చేశారు. ఇంతకీ అవేంటంటే..?
KTR Tweet Today
దేశాన్ని కాపాడుకోలేని ప్రధానిని ఏమని పిలవాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధాన మంత్రిని ఏమని పిలవాలో చెప్పాలని కోరుతూ నాలుగు ఆప్షన్లను ట్వీట్ చేశారు. ఎ. 56” బి. విశ్వగురు సి. అచ్చేదిన్ వాలే డి. పైన పేర్కొన్నవన్నీ అన్‌పార్లమెంటరీ పదాలు కాబట్టి తొలగించబడ్డాయి అంటూ వ్యంగ్యంగా ట్వీటారు.