తెలంగాణ

telangana

By

Published : Mar 3, 2022, 9:36 AM IST

ETV Bharat / city

KTR Tweet Today : 'వారి కల సాకారం చేయడం ఆనందంగా ఉంది'

KTR Tweet Today : పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంలో తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్ల పథకం ప్రవేశపెట్టారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. మేడ్చల్ జిల్లా ఓల్డ్ మారేడ్‌పల్లిలో 468 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

KTR Tweet Today
KTR Tweet Today

KTR Tweet Today : రాష్ట్రంలో ప్రతిపేద వాడికి సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బృహత్ పథకమే రెండు పడక గదుల ఇల్లు అని పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో తలెత్తుకుని ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. హైదరాబాద్‌లోని ఓల్డ్ మారేడ్‌పల్లిలో నిర్మించిన 468 రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా మంత్రి హర్షం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ముందు.. ఆ తర్వాత ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేశారు.

"ఓల్డ్ మారేడ్‌పల్లిలో 468 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు అందజేయడం చాలా సంతోషంగా ఉంది. ఓ మురికివాడను అభివృద్ధి చేయడం సవాల్‌తో కూడుకున్నది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ద్వారా ఈ కల సాకారమైంది. కేసీఆర్ సర్కార్ రాష్ట్రాన్ని ప్రగతి పథకంలో ముందుకు తీసుకెళ్తోందనడానికి ఇది మరో ఉదాహరణ."

- కేటీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details