ప్రస్తుత పరిస్థితుల నుంచి కొత్త అవకాశాలను సృష్టించే దిశగా ఐటీ పరిశ్రమలు, నిపుణులు కృషి చేయాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలనూ సాంకేతికత సాాయంతో పరిష్కరించాలని అన్నారు. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ పరిశ్రమల సంఘం (హైసియా) నూతన కార్యవర్గం అధ్యక్షుడు భరణి అరోల్ నేతృత్వంలో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయింది. నూతన కార్యవర్గాన్ని కేటీఆర్ అభినందించారు.
'ఐటీ రంగ పురోగమనాన్ని కరోనా అడ్డుకోలేకపోయింది' - మంత్రి కేటీఆర్‌ను కలిసిన హైసియా అధ్యక్షుడు
తెలంగాణలో ఐటీ పరిశ్రమల వృద్ధి రేటు భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. కరోనా సంక్షోభం అన్ని పరిశ్రమలపై కొంత ప్రభావం చూపిందని, ఐటీ రంగం పురోగమనాన్ని మాత్రం అడ్డుకోలేకపోయిందని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని అనేక సంస్థలు నూతన పరిష్కారాలతో ముందుకు వస్తున్నాయని, అలాంటి సంస్థలకు ప్రభుత్వం తరఫున మద్దతు ఇస్తామన్నారు. విహజ్ అంకుర పరిశ్రమ అందుబాటులోకి తెచ్చిన ఆన్‌లైన్ సమావేశ పరిష్కారాల విధానాన్ని ఐటీ శాఖలో అంతర్గత సమావేశాలకు వినియోగించుకుంటున్న విషయాన్ని గుర్తుచేశారు.
హైసియా ప్రతినిధులు మాట్లాడుతూ గత ఆరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు, సహకారం హైదరాబాదులో ఐటీ పరిశ్రమ వృద్ధికి దోహదపడిందన్నారు. అనంతరం ప్రస్తుతం ఐటీ రంగం స్థితిగతులు, ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలపై హైసియా ప్రతినిధులు పలు సూచనలను మంత్రికి అందించారు.