తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎన్నికల కోసం కాకుండా.. ప్రజల కోసం పనిచేయండి : కేటీఆర్ - ktr fires on modi government

తెలంగాణకు ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్​లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 60 ఎకరాలు అడిగితే.. 150 ఎకరాలు ఇచ్చామని తెలిపారు.

telangana minister ktr fires on modi government
రాష్ట్ర మంత్రి కేటీఆర్

By

Published : Mar 5, 2021, 1:09 PM IST

ఐటీఐఆర్ రద్దు చేసి తెలంగాణకు అన్యాయం చేశారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రియల్ జోన్ ఇవ్వలేదని మండిపడ్డార. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఊసే లేదని వాపోయారు. కేంద్రం హామీలిచ్చి నెరవేర్చకపోతే ఎవర్ని అడగాలని ప్రశ్నించారు.

రాష్ట్ర మంత్రి కేటీఆర్

ఎన్నికల కోసం కాకుండా ప్రజల కోసం, దేశం కోసం పనిచేయండి అని మంత్రి కేటీఆర్ సూచించారు. దిగుమతి సుంకాలు పెంచి మేకిన్ ఇండియా అంటే కంపెనీలు వస్తాయా అని నిలదీశారు. రాష్ట్రం నుంచే అధిక రెవెన్యూ తీసుకుంటూ అన్యాయం చేస్తున్నారని ఆవేదన చెందారు. బుల్లెట్ రైలు గుజరాత్​కేనా.. హైదరాబాద్​కు అర్హత లేదా అని ప్రశ్నించారు. వరంగల్​లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 60 ఎకరాలు అడిగితే.. 150 ఎకరాలు ఇచ్చామని అయినా.. దాని ఊసే లేదని కేటీఆర్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details