KTR About Musi River Beautification : దేశంలో ఎక్కడా లేనంత వేగంగా హైదరాబాద్‌లో మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతోందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నగర రవాణా మెరుగు పర్చేందుకు బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. 5వేల 555కోట్లతో ఎస్‌ఆర్‌డీపీ ఫేజ్ -1, 3వేల 115కోట్లతో ఎస్‌ఆర్‌డీపీ ఫేజ్-2 పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
KTR About Hyderabad Development: "హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడానికి కావాల్సిన అన్ని హంగులను ఏర్పాటు చేస్తున్నాం. దేశంలో ఏ నగరంలో జరగనంత వేగంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నాం. రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్‌లు, అండర్ పాస్‌లు, స్కై వంతెనలతో నగర ప్రజలకు రవాణా సులభతరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తోందని తెగ ఊదరకొడుతున్నారు. కానీ తీసుకువచ్చిన అప్పులకు డబుల్ ఆదాయం వచ్చేలా పనులు చేపడుతున్నాం. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలా భాగ్యనగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం."