తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Minister KTR : 'ఉప రాష్ట్రపతి కేసీఆర్' ప్రచారంపై కేటీఆర్ క్లారిటీ - రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు

కాంగ్రెస్​ పార్టీలో ఉన్న మంచి వ్యక్తి భట్టి విక్రమార్క అని.. కానీ ఆయనది అక్కడ ఏం నడవడం లేదని రాష్ట్ర మంత్రి కేటీఆర్(Telangana Minister KTR) అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి.. హుజూరాబాద్​ ఉపఎన్నికలో గెలిచి తన సత్తా చాటుకోవాలని సవాల్ విసిరారు. కేసీఆర్ ఉపరాష్ట్రపతి అవుతారనేది వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారమని స్పష్టం చేశారు.

Telangana Minister KTR
Telangana Minister KTR

By

Published : Oct 19, 2021, 11:54 AM IST

Updated : Oct 19, 2021, 12:40 PM IST

కాంగ్రెస్​లో భట్టివిక్రమార్క(CLP Leader Bhatti Vikramarka) మంచి వ్యక్తి అని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్(Telangana Minister KTR) అన్నారు. కానీ ఆ పార్టీలో భట్టిది నడవట్లేదని.. గట్టి అక్రమార్కులదే నడుస్తోందని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy) జోస్యం చెప్పుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. జర్నలిస్టులతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయన్న మంత్రి.. కేసీఆర్ విజనరీ నేత అని.. మిగతా పార్టీల నేతలు టెలివిజనరీలు అని పేర్కొన్నారు.

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy) తొలి ఎన్నికలో నిరూపించుకోవాలి కదా అని కేటీఆర్(Telangana Minister KTR) అన్నారు. రేవంత్ హుజూరాబాద్(Huzurabad by election 2021)​ ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు. కొడంగల్​లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని.. ఎందుకు చేయలేదని అడిగారు. నవంబర్ 3 తర్వాత దళితబంధును ఎవరూ ఆపలేరని అన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడమనేది సందర్భం బట్టి ఉంటుందని.. కేసీఆర్​.. ఉపరాష్ట్రపతి అవుతారనేది వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం అని స్పష్టం చేశారు.

"హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి(Huzurabad by election campaign 2021) నేను వెళ్లడం లేదు. నాగార్జునసాగర్, దుబ్బాక ప్రచారానికీ నేను వెళ్లలేదు. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ప్రచారం ఇంకా ఖరారు కాలేదు. జానారెడ్డినే ఓడించాం, రాజేందర్ అంతకన్నా పెద్ద లీడరా?. భాజపా బురదను ఈటల అంటించుకున్నారు. జై ఈటల అంటున్నారు తప్ప, జైశ్రీరామ్ అనట్లేదు ఎందుకు? భాజపా అంటే ఓట్లు పడవనే.. ఈటల ఆ పార్టీ పేరు ఎత్తడం లేదా?"

- కేటీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి

Last Updated : Oct 19, 2021, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details