KTR About BJP : 'భాజపాది బలుపు కాదు వాపు'
రాష్ట్రంలో భాజపా బలం పెరుగుతుందన్న వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. భాజపాది వాపు అని.. వాపును చూసి బలుపు అనుకోవద్దని అన్నారు. టీవీలు, సామాజిక మాధ్యమాలు, అరుపులు, కేకలు, హడావిడిని నమ్మొద్దని చెప్పారు. 2018 ఎన్నికల్లో భాజపా 108 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందన్న మంత్రి.. ఎంఐఎం తన ప్రత్యర్థి అని తెలిపారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఏడు సీట్లను సాధించిందిందని వెల్లడించారు.
KTR About BJP