రాష్ట్రం కాని రాష్ట్రంలో అకలికి అలమటిస్తూ.. సాయం కోసం ఎదురుచూస్తున్నారు తెలంగాణ వాసులు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో రాష్ట్ర వాసులు పడుతున్న ఇక్కట్లు అన్ని ఇన్ని కావు. లాక్‌డౌన్ ప్రభావం వారి ఉపాధిని దెబ్బతీసింది. చేసేది లేక నేపాల్ నుంచి రాష్ట్రానికి నడక ప్రారంభించారు. ఆకలి కేకలు ఒక వైపు.. భానుడి భగభగలు ఇంకో వైపు. అక్కడక్కడ దాతలు ఇచ్చే పండ్లు, ఫలహారాలతోనే కడుపు నింపుకుంటూ.. సాగింది వారి ప్రయాణం
"బతుకుదెరువు కోసం నేపాల్ వెళ్లాం. లాక్‌డౌన్‌తో ఉపాధి కొల్పోయాం. నడుచుకుంటూ లఖ్నవూో వరకు రాగా పోలీసులు మాకు ఇక్కడ ( శకుంతలా మిశ్రా విశ్వవిద్యాలయంలో) ఉండమని చెప్పారు. మేమంతా మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన వాళ్లం. రాష్ట్రానికి పోవడానికి మాకు ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. ఎట్లన్న చేసి మీరు మమ్మల్ని అక్కడికి తీసుకుపోవాలే. పిల్లలున్నరు, ఆడోళ్లున్నరు.. సీఎం సారూ మీరే మాకు సాయం చేయాలి". - ఓ వలస కూలీ
"మా తల్లిదండ్రులు మాకోసం ఏడుస్తున్నరు సార్. మాకు మా పిల్లలకు ఇక్కడ అన్నం కూడా అందట్లే. ఎట్లన్న జేసి మమ్ముల్ని తీసుకుపోండి సార్. శానా పరేషాన్లో ఉన్నం".- మహిళా కూలీ