కరోనా బారిన పడిన పాత్రికేయులకు అన్ని విధాల అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. వైరస్ బారిన పడిన ముప్పై మంది జర్నలిస్టులకు రూ.20 వేల చొప్పున ఆరు లక్షల రూపాయల ఆర్థికసాయం అందజేశామని తెలిపారు.
కరోనా సోకిన పాత్రికేయులకు ఆర్థిక సాయం - హైదరాబాద్ తాజా వార్తలు
కరోనా బారిన పడిన జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ఆర్థిక సాయం ప్రకటించారు. కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన 11మంది పాత్రికేయులు ఒక్కొక్కరికి రూ.20వేలు అందించారు.
కరోనా సోకిన పాత్రికేయులకు రాష్ట్ర మీడియా అకాడమీ ఆర్థిక సాయం
హోంక్వారైంటైన్లో ఉన్న 13 మంది పాత్రికేయులకు 10 వేల రూపాయల చొప్పున రూ.1,30,000 అందించామని అల్లం నారాయణ తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 7,30,000 రూపాయలు అకాడమీ నిధుల నుంచి ఇచ్చామని వివరించారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవీ చూడండి: నిత్యావసర ధరల పెరుగుదలపై హైకోర్టుకు నివేదిక