Sajjanar Tweet About RRR : తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సజ్జనార్ ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. డిస్కౌంట్లు, ఆఫర్లు, సోషల్ మీడియాలో పబ్లిసిటీ.. ఇలా అన్నిరకాల అస్త్రాలు ఉపయోగిస్తూ రాష్ట్ర ప్రజలను బస్సు ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక సామాజిక మాధ్యమాల్లో సజ్జనార్ హవా మామూలుగా ఉండదు. నేటి యువతతో బాగా కనెక్ట్ అయ్యే సజ్జనార్.. వారిని కూడా ఆర్టీసీ బస్సు ఎక్కించేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నారు.
TSRTC Uses RRR Song : సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్, ట్రోల్స్, ఫన్నీ వీడియోస్.. ఇలా అన్నింటిని అవకాశంగా మలుచుకుని ఆర్టీసీ పబ్లిసిటీకి వాడేస్తున్నారు. విడుదలకు ముందే ప్రపంచ వ్యాప్తంగా ఫేమ్ సంపాదించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను కూడా సజ్జనార్ ఆర్టీసీ పబ్లిసిటీకి ఉపయోగించారు. ఇటీవలే విడుదలైన ఆ సినిమాలోని పాట నెత్తురు మరిగితే ఎత్తుర జెండా పాట వీడియోను ఎడిట్ చేసి తెలంగాణ ఆర్టీసీని ప్రమోట్ చేశారు. ట్విటర్‌లో ఆయన పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి నెటిజన్లంతా.. సజ్జనార్‌తో మామూలుగా ఉండదు మరి అంటూ రీట్వీట్స్ చేస్తున్నారు.
RRR Song For TSRTC Publicity : పబ్లిసిటీకి మాస్టర్ మైండ్ అయిన రాజమౌళి సినిమా టైటిల్‌ను అందులోని సాంగ్‌ని సజ్జనార్ ఆర్టీసీ పబ్లిసిటీకి ఉపయోగించడం పట్ల ఆయన ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆ సినిమా టైటిల్‌ను, పాటను ఆర్టీసీ కోసం ఎలా వినియోగించారో తెలుసా.... ఆర్‌ఆర్‌ఆర్ అంటే "రణం, రౌద్రం, రుధిరం" అనుకుంటున్నారా.... కాదు.. "రాష్ట్ర రోడ్డు రవాణా" సంస్థ అంటూ తనదైన శైలిలో ఆర్‌ఆర్‌ఆర్‌కు సరికొత్త అర్థాన్ని చెప్పారు సజ్జనార్.
పాటను ఎలా వాడారంటే.. ఎత్తరజెండా పాటలోని జెండాలపై వందేమాతరం అని ఉంటే.. ఆ వీడియోని ఎడిట్ చేసి వందేమాతరం ప్లేస్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) అనే అక్షరాలతో పాటు లోగోను కూడా ఏర్పాటు చేశారు. ఆ వీడియో చూస్తే ఏకంగా.. రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్‌లే టీఎస్‌ఆర్టీసీ ప్రమోషన్స్ చేస్తున్నట్లు ఉంది. సజ్జనార్ క్రియేటివిటీ భలే క్రేజీగా ఉంది కదా. నెటిజన్లు కూడా ఇదే అంటున్నారు. ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, వేలల్లో రీట్వీట్స్ వచ్చాయి.
VC Sajjanar Tweet Today : కరోనా, లాక్‌డౌన్, ఒమిక్రాన్ వల్ల నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఎండీ సజ్జనార్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఓవైపు ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షిస్తూ.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. టీఎస్‌ఆర్టీసీ పబ్లిసిటీ పనుల్లో నిమగ్నమవుతున్నారు. దశాబ్ధాలుగా తెలంగాణ ఆర్టీసీని ఈ రకంగా ఎవరూ ప్రమోట్ చేసి ఉండటరని యువత అంటున్నారు. ఎనీవేస్.. సజ్జనార్ క్రియేటివిటీ ఈటీవీ భారత్ సలామ్..