corona: రాష్ట్రంలో మరో 3,527 కరోనా కేసులు, 19 మరణాలు - latest corona cases in telangana
19:24 May 28
రాష్ట్రంలో మరో 3,527 కరోనా కేసులు, 19 మరణాలు
రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల వ్యవధిలో 97,236 శాంపిల్స్ పరీక్షించగా.. 3,527 మంది కరోనా సోకినట్లు (corona positive) నిర్ధారణ అయింది. కొత్తగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,982 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 519 కొత్త కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 218, ఖమ్మం 215 కేసులు చొప్పున నమోదయ్యాయి.
ఇప్పటివరకు 1.49 కోట్లకు పైగా శాంపిల్స్ (corona samples) పరీక్షించగా.. 5,71,044 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 5,30,025 మంది కోలుకోగా.. 3.226 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27,793 (Corona Active Cases) యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 92.81 శాతం కాగా.. మరణాల రేటు (Death rate) 0.56 శాతంగా ఉంది.