Telangana corona cases: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,883 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,043 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,09,209కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
corona active cases: తాజాగా రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,057కు చేరింది. కరోనా బారి నుంచి కొత్తగా 2013 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,048 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1,174 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 96.31 శాతంగా ఉన్నట్లు ప్రకటించింది.
ఎమ్మెల్యే కుటుంబంలో కలకలం..
ఇదిలా ఉండగా.. ఈరోజు మంచిర్యాల ఎమ్మెల్యే కుటుంబంలో కరోనా కలకలం సృష్టించింది. ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఆయన భార్య, కోడలుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. స్వల్ప లక్షణాలే ఉండటంతో.. ఎమ్మెల్యే సహా ముగ్గురు ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు.
పోలీసుశాఖలో పెరుగుతున్న కేసులు..
మరోవైపు పోలీసుశాఖలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. రాజేంద్రనగర్ పీఎస్‌లో ఏకంగా 16 మంది పోలీసులకు కరోనా సోకింది. ఎస్సై, ఏఎస్ఐతో పాటు 14 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. జగద్గిరిగుట్ట పీఎస్‌లో ఎస్సైతో పాటు ఏడుగురు కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. జీడిమెట్ల పీఎస్‌లో ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు.. పేట్‌బషీరాబాద్ పీఎస్‌లో ఇద్దరు ఎస్సై, ఒక హోంగార్డు.. దుండిగల్ పీఎస్‌లో ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డు కరోనా బారిన పడ్డారు. మొత్తంగా.. 34 మందికి కొవిడ్ సోకింది. వీళ్లంతా.. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.
కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. రాష్ట్రంలో తాజాగా 1,53,699 మందికి కొవిడ్ టీకాల పంపిణీ జరిగింది. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
దేశంలో కరోనా ఉద్ధృతి..
Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కొత్తగా.. 2,71,202 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 314 మంది మరణించారు. 1,38,331 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 37,122,164
- మొత్తం మరణాలు: 4,86,066
- యాక్టివ్ కేసులు: 15,50,377
- మొత్తం కోలుకున్నవారు: 3,50,85721
ఇదీ చూడండి: