తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం! - telangana rain news

రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ద్రోణి కారణంగా వర్షాలకు అవకాశముందని తెలిపింది. ఉపరితల ద్రోణి కారణంగా గురువారం రాత్రి, శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.

rain
rain

By

Published : Feb 20, 2021, 10:12 AM IST

రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి జల్లులు కురిసే సూచనలు ఉన్నాయని.. వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం నుంచి రాష్ట్రం మీదుగా తమిళనాడు, కర్ణాటకపైకి ఆవరించిన ఉపరితల ద్రోణి కారణంగా.. వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

ప్రస్తుతం రాష్ట్రంతో పాటు ఏపీ, తమిళనాడు, యానాంలో ఆకాశం మేఘావృతమై ఉందని ఐఎండీ వెల్లడించింది. రాగల రెండు రోజుల్లో ఒడిశా, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, ఏపీతో పాటు రాష్ట్రంలో తేలికపాటి జల్లులు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది.

ఉపరితల ద్రోణి కారణంగా గురువారం రాత్రి, శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌ జిల్లా మోస్రాలో అత్యధికంగా 22 మి.మీ. వర్షపాతం నమోదైంది. జంటనగరాల్లో చాలాచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. శుక్రవారం సికింద్రాబాద్‌ పాటిగడ్డలో 21.3 మి.మీ., రెయిన్‌బజార్‌లో 19.8, మోండా మార్కెట్‌లో 19.3, ఎల్‌బీ స్టేడియంలో 18 మి.మీ. వర్షపాతం నమోదైంది.

ఇదీ చదవండి:గోదావరి-కావేరి అనుసంధానం.. ఇచ్చంపల్లి నుంచే!

ABOUT THE AUTHOR

...view details