Telangana Liberation Day Celebrations: సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోజన వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. తొలిసారి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలకు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేశారు. నిజాం అకృత్యాలను కళ్లకు కట్టేలా థీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో వెయ్యి ఉరుల మర్రి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నిజాం అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరు సాగించిన రాంజీ గోండు అనుచరుల్లో వెయ్యిమందిని నిర్మల్‌లోని ఒక మర్రి చెట్టుకు ఉరి తీశారు. నిజాం అరాచకాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసానికి సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్రం ఏర్పాటు చేసింది.
తెలంగాణ విమోచన వేడుకల్లో సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ వంటి మొత్తం 7 కేంద్ర బలగాలు కవాతును నిర్వహించనున్నాయి. 12 ట్రూపులు, 1300 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో 8 ట్రూపులు తెలంగాణకు చెందినవి కాగా రెండు మహారాష్ట్ర, మరో రెండు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ట్రూపులున్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విమోచన వేడుకలకు సంబంధించి ఇప్పటికే రిహార్సల్స్ సైతం పూర్తయ్యాయి.
విమోచన వేడుకల్లో పాల్గొనాలని తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే హాజరవుతుండగా...కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై.. ఆ రాష్ట్ర వేడుకల్లో పాల్గొనున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి. విమోచన ఉత్సవాల్లో పాల్గొనేందుకు కేంద్రమంత్రి హోంశాఖ మంత్రి అమిత్‌షా నిన్న రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా నేతలు ఆయనకు స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం 8 గంటల 45 నిమిషాలకు అమిత్‌షా పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకుంటారు. తొలుత సైనిక అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం జాతీయజెండాను ఎగురవేస్తారు. కేంద్ర బలగాల గౌరవ వందనం స్వీకరించనున్నారు. తెలంగాణ విమోచన వేడుకలను కేంద్రం నిర్వహించడానికి కారణాలు, కేసీఆర్ వైఖరిపై అమిత్‌షా ప్రసంగించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొనేందుకు బండి సంజయ్ ఇవాళ తన పాదయాత్ర వాయిదా వేసుకున్నారు. ఉత్సవాల వల్ల కేంద్రానికి పేరుస్తోందనే భయంతోనే సీఎం కేసీఆర్ ఇవాళ సెలవు ప్రకటించారని బండి ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ విమోచన వేడుకలు ఇవీ చదవండి: