తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి పెంపుపై చట్టసవరణ బిల్లుకు మండలి ఆమోదం - ఎఫ్‌ఆర్‌బీఎం సవరణ బిల్లుకు మండలి ఆమోదం

FRBM amendment bill Approved :అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో భాగంగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి పెంపుపై చట్టసవరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుల సంఖ్య పెంపు బిల్లుకు కూడా మండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

FRBM amendment bill Approved
FRBM amendment bill Approved

By

Published : Mar 15, 2022, 1:49 PM IST

FRBM amendment bill Approved : ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి పెంపుపై చట్టసవరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి ఈ ఏడాది 4, వచ్చే ఏడాది 5 శాతం పెంపునకు ఆమోదముద్ర వేసింది.

వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుల సంఖ్య పెంపు బిల్లుకు మండలి పచ్చజెండా ఊపింది. సభ్యుల సంఖ్య 8 నుంచి 12కు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. మార్కెట్ కమిటీ సభ్యుల పదవీ కాలం పెంపు బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. ఇకనుంచి సభ్యుల పదవీ కాలం ఏడాది నుంచి రెండేళ్లకు పెంచుకునే అవకాశం కలగనుంది.

"రైతుల ప్రాతినిథ్యాన్ని పెంచేందుకు ఈ బిల్లు ఎంతో దోహదపడుతుంది. ఒకే అధికార వర్గం పరిధిలో ఉన్న భిన్న వర్గాలకు చెందిన రైతులకు ప్రాతినిథ్య అవకాశం కల్పించే ఉద్దేశంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకు ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో కర్షకుల అభివృద్ధికి బాటలు పడుతున్న నేపథ్యంలో అన్నదాతల ప్రగతి మరింత దూసుకెళ్లడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఈ బిల్లు చట్టరూపం దాల్చడానికి దీన్ని ఆమోదించాలని కోరుతున్నాను."

- నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details