ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలుజులైలో ఎంసెట్! ఎంసెట్‌ను జులై మొదటి లేదా రెండో వారంలో నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఇంటర్ పరీక్షలు, జేఈఈ పరీక్షల తేదీల వెసులుబాటును పరిశీలించి జులై రెండో వారంలోపు ఎంసెట్‌ను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నత విద్యామండలి అధికారులు ఉన్నారు.భర్త కట్నదాహానికి వైద్యురాలు బలిMBBS Doctor Suicide: అదనపు కట్నం వేధింపులు భరించలేక వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఈనెల 8న మలక్‌పేట ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.తండ్రి చనిపోయిన చోటే ఉరేసుకుని.. Father and Son Died in Jakaram : తండ్రి బాటలో తనయుడు నడవడం అనేది సాధారణం. కానీ అది ప్రాణాలు తీసుకునేలా చేస్తే? అప్పుల బాధలు, భూ తగాదాలతో విసిగివేసారిపోయిన ఓ రైతు పొలంలోనే ఉరి వేసుకోగా.. నువ్వు చూపిన బాటలోనే నేను.. నిన్ను విడిచి నేనుండలేను నాన్నా.. అంటూ కుమారుడు కూడా అదే చోట ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడ మండలంలోని జాకారం గ్రామంలో చోటుచేసుకుంది.ఏడేళ్ల బాలికపై అత్యాచారంAyodhya minor rape: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ ప్రబుద్ధుడు. నిందితుడి వివరాలు ఇంకా తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు.స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు Covid Cases In India: భారత్‌లో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 2,539 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 60 మంది మరణించారు. కొత్తగా 4,491 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.జపాన్ భూకంపంలో నలుగురు మృతి.. japan earthquake: జపాన్‌లో బుధవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కొల్పోయారు. 97 మంది గాాయాలపాలయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేలుపై 7.3గా నమోదైంది. ఫుకుషిమో తీర ప్రాంతంలో 60కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు.కాలకూట విషాల తయారీ ఫ్యాక్టరీ Russia chamber: రష్యా రాజధాని మాస్కో శివార్లలో సైంటిఫిక్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నెం.2 భవనం ఉంది. కేజీబీ మాజీ అధికారులు, రష్యా నుంచి పారిపోయిన సీనియర్ గవర్నమెంట్ అధికారులు ఆ భవనం గురించి భయంకరమైన కథను ప్రపంచానికి వెల్లడించారు. ఇది క్రెమ్లిన్ కాలకూట విషాల తయారీ ఫ్యాక్టరీ అని పేర్కొన్నారు.రష్యాకు వ్యతిరేకంగా ఓటేసిన భారత జడ్జిIndian judge votes against Russia: ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై తీర్పు వెలువరించిన అంతర్జాతీయ న్యాయస్థానం ధర్మాసనంలో భారత న్యాయమూర్తి సైతం ఉన్నారు. ఆయన రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం. మరోవైపు.. చైనా, రష్యా న్యాయమూర్తులు ఉక్రెయిన్ పిటిషన్‌ను వ్యతిరేకించారు.ఆమె నచ్చదన్న అక్షయ్! Akshay Kumar Jacqueline Fernandez: బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కన్నా నటి కృతి సనన్ అంటేనే తనకు ఇష్టమని చెప్పారు స్టార్ హీరో అక్షయ్ కుమార్. జాక్వెలిన్ గురించి అడిగిన ఒకే ఒక్క ప్రశ్నతో ఈ మేరకు సమాధానమిచ్చారు అక్షయ్. ఇంతకీ అదేంటంటే?భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. అంతర్జాతీయ సానుకూల పవనాలతో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా లాభపడింది. ప్రస్తుతం 1023 పాయింట్ల వృద్ధితో 57,850 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌లోని అన్ని షేర్లు లాభాల్లోనే ఉన్నాయి.