- ఉక్రెయిన్‌లో డేంజర్ బెల్స్!
RUSSIA UKRAINE WAR UPDATES: రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా చేసిన దాడుల్లో.. 10 మంది పౌరులు మరణించారు. కాగా, చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్‌కు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. గ్రిడ్ ధ్వంసం కావడం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్లాంట్‌కు అనుసంధానమైన జనరేటర్లలో 48 గంటలకు సరిపడా డీజిల్ మాత్రమే ఉంది.
- 'ప్రపంచస్థాయి కంపెనీలకు అధిపతులుగా ఎదగాలి'
KTR At Nizam College Convocation: భారతీయులు ప్రపంచ స్థాయి కంపెనీలకు అధిపతులుగా ఉన్నారని.. ప్రపంచ స్థాయి కంపెనీలు సృష్టించే లోటును నేటి యువత తీర్చాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఏడేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇవాళ ఆనందించే రోజు అని అన్నారు. హైదరాబాద్ నిజాం కళాశాలలో స్నాతకోత్సవానికి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.
- రేపు కేఆర్ఎంబీ కీలక భేటీ
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం గురువారం జరగనుంది. వర్చువల్ విధానంలో కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ మధ్య నీటి కేటాయింపులపై చర్చ జరగనుంది.
- రూ.1,984 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్
కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ రూ.1,984 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రూ.213కోట్ల విలువైన భూమి, రూ.438 కోట్ల షేర్లు, రూ.1280 కోట్ల ఇతర ఆస్తులను అటాచ్ చేసింది.
- 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11,103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు.