ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు'తెలంగాణ దేశానికే ఆదర్శం' Harish Rao About Budget 2022-23 : కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో సాధించని ప్రగతి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేళ్లలో చేసి చూపించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఉద్ఘాటించారు. బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చకు సమాధానం ఇచ్చారు. కొత్తగా ఏర్పడినా కూడా తెలంగాణ ఎన్నో రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. నిరాశ చెందానని కోమటిరెడ్డి అంటే.. సూపర్ అన్న జగ్గారెడ్డి..Congress On Job Notification: ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రకటనను స్వాగతిస్తూనే.. మిగిలిన పోస్టులూ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.'బడ్జెట్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా లేదు' తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్దు.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర విషయంలో నిజానిజాలను వీలైనంత త్వరగా ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ద్వారా ఎన్ని టీఎంసీల నీళ్లు ఎత్తిపోశారు.. నీరు ఎత్తిపోయడానికి ఎంత విద్యుత్ ఖర్చైంది వంటి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని భట్టి కోరారు.చెట్టు కొమ్మలు మీద పడి బాలుడు మృతికామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం భాగీర్థిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెట్టుకొమ్మలు విరిగి మీద పడటంతో బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన విద్యార్థి సంపత్(14) చెట్టుకింద ఆడుకుంటుండగా కొమ్మలు విరిగి మీద పడ్డాయి. ఘటనలో సంపత్ అక్కడికక్కడే మృతి చెందాడు. 'అందుకే ఉద్యోగాల భర్తీ చేపట్టలేకపోయాం' CM KCR Speech: అసెంబ్లీ సమావేశంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఇందులో భాగంగా ఉద్యోగుల విషయంలో ఏపీ అర్ధరహిత వాదనలు చేస్తోందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వివాదాలు ఇప్పటికీ తేలలేదని తెలిపారు. వివాదాలు తెగకపోవడం వల్లే ఉద్యోగాల భర్తీ చేపట్టలేకపోయామని స్పష్టం చేశారు.మినీ సార్వత్రికం కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. 5 states election counting: సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం... కేంద్ర ఎన్నికల సంఘం విస్త్రత ఏర్పాట్లు చేసింది. దేశ ప్రజంలదరి దృష్టి..అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌పైనే కేంద్రీకృతమైంది. రోడ్డు పక్కన పేలిన బాంబు.. Blast in Udhampur: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్ముకశ్మీర్‌లోని ఉదమ్‌పుర్‌లో బాంబు దాడికి దిగారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. మరో 12 మందిగా గాయాలయ్యాయి.ఎయిర్ ఇండియా విమానం హైజాకర్ హతం.. Indian Airlines hijacker: 1999లో కాఠ్మాండూ నుంచి దిల్లీ వస్తున్న విమానాన్ని హైజాక్ చేసిన వారిలో ఓ ఉగ్రవాది హత్యకు గురైనట్లు పాక్ మీడియా తెలిపింది. గుర్తు తెలియని వ్యక్తులు మిస్త్రీ జహూర్ ఇబ్రహీంను పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపినట్లు పేర్కొంది.క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌పై అత్యాచార ఆరోపణలు! Rape attempt: తనపై బీహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాకేష్ తివారీ అత్యాచారయత్నానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిల్లీలోని ఓ 5 స్టార్ హోటల్లో బలవంతంగా అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని, తాను తప్పించుకుని పారిపోయినట్లు బాధితురాలు తెలిపారు.స్టాక్ మార్కెట్లలో బుల్‌రన్.. Stock Market closing: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా వృద్ధి చెందగా.. నిఫ్టీ 332 పాయింట్లు ఎగబాకింది.