ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుప్రమాదకరంగా జీవనశైలి వ్యాధులు Dangerous Lifestyle diseases : ఇటీవల కాలంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న పరీక్షల్లో ఈ విషయం స్పష్టం అవుతోంది. 30 ఏళ్లు నిండిన వారికి ఈ పరీక్షలు చేస్తుండగా... ఆహార అలవాట్లలో మార్పుల వల్ల ముప్పు పెరుగుతున్నట్లు తేలింది.చెత్తే కదా అని.. తగలబెడుతున్నారా..? హైదరాబాద్ బాలానగర్‌లోని రహదారి చెంత ఇటీవల ఒక్కసారిగా మంటలు చెలరేగి పరిసర ప్రాంతాల్లో నల్లటి పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. మంటల తీవ్రత అంతకంతకూ పెరగడంతో స్థానికులు అగ్నిమాపక శాఖకు ఫోన్ చేయగా.. అక్కడికి చేరుకున్న సిబ్బంది అరగంట పాటు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇంత భారీ స్థాయిలో మంటలకు కారణాలను విశ్లేషించగా.. చెత్తకుండీలోని వ్యర్థాల్ని తగలబెట్టడమేనని అధికారులు తేల్చారు. ఇదొక్కటే కాదు.. నగరంలో ఏటా వందల సంఖ్యలో ఇలాంటి ఉదంతాలే చోటుచేసుకుంటున్నాయి.స్క్రూలు మింగిన ఏడాదిన్నర బాలుడు... చివరకు.. Child swallow screws in warangal: తల్లిదండ్రులు వారివారి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంతలో ఏడాదిన్నర చిన్న పిల్లవాడు ఇంట్లో ఆడుకుంటూ సైకిల్ ఇనుప స్క్రూలను మింగిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.నాటో వెనకడుగుకు కారణమేంటి?Ukraine no fly zone: ఉక్రెయిన్ను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. అందుకు నాటో కూటమి అంగీకరించలేదు. మరోవైపు.. నిషిద్ధ గగనతంగా ప్రకటిస్తే నేరుగా యుద్ధంలోకి వచ్చినట్టేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నో ఫ్లై జోన్ అమలు చేయటం సాధ్యమేనా? దాని వల్ల తలెత్తే పరిణామాలేంటి?భారీగా తగ్గిన కరోనా కేసులు.. Covid Cases in India: దేశంలో కొత్తగా 5476 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,62,953కు చేరింది. వ్యాక్సినేషన్లో భాగంగా శనివారం 26,19,778 డోసులు పంపిణీ చేశారు.టాటూల కోసం వెళ్తే లైంగిక వేధింపులు.. Tattoo artist arrest: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న కారణంతో ఓ టాటూ ఆర్టిస్ట్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటన కేరళలో జరిగింది.ధనుష్ వల్లే ఆ ఛాన్స్ వచ్చింది: హ్యూమా ఖురేషీ Valimai heroine Huma Qureshi: 'కాలా'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హ్యూమా ఖురేషీ. ఇటీవలే విడుదలైన 'వలిమై'లో అజిత్ సరసన మెరిసిన ఈ అమ్మడు తన కుటుంబం, చదువు, సినిమాల గురించి ఏం చెబుతోందంటే...అదరగొట్టిన టీమ్ఇండియా.. Worldcup 2022 IND VS PAK: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు(ఆదివారం) జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టీమ్ఇండియా. పూజా వస్త్రాకర్(67), స్నేహ్ రానా(53*), స్మృతి మంధాన(52) హాఫ్ సెంచరీలతో మెరిశారు.బౌన్సర్లను నిషేధించాల్సిన అవసరం లేదు: ఎంసీసీ Banning bouncer MCC: గత కొన్నాాళ్లుగా క్రికెట్లో బౌన్సర్లను నిషేధించాలంటూ వస్తోన్న వాదనలపై స్పందించింది మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్. వాటిని నిషేధించాల్సిన అవసరం లేదని తెలిపింది. అలా చేస్తే ఆట విధానం మారిపోతుందని పేర్కొంది.'మహిళలు అందుకు సమయం కేటాయించడం తప్పనిసరి!'Health and Life Insurance: మహిళలు తప్పనిసరిగా జీవిత, ఆరోగ్య బీమా పాలసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్యూరెన్స్ ఎండీ, సీఈఓ విభా పదాల్కర్. కొవిడ్ ప్రభావంతో చాలా మంది ఆర్థిక రక్షణపై దృష్టి సారించడం ప్రారంభించారని పేర్కొన్నారు.