ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..ముగిసిన సీఎం కేసీఆర్ ముంబయి పర్యటన.. సీఎం కేసీఆర్ ముంబయి పర్యటన ముగిసింది. పర్యటనలో భాగంగా మహరాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎన్నెస్పీ అధినేత శరద్ పవర్‌తో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై ఇద్దరు నేతలతో లోతుగా చర్చించారు.పెళ్లి వాహనం బోల్తా.. వధువు తల్లితో సహా..Accident to Wedding Vehicle: పెళ్లికూతురితో పాటు బంధువులంతా మండపానికి ఓ వాహనంలో వెళ్లిపోయారు. మిగిలిపోయిన బంధువులను తీసుకుని వధువు తల్లి ఇంకో వాహనంలో బయలుదేరింది. పట్టుచీరల ముచ్చట్లు.. పెళ్లి సందడితో ఉన్న ఆ వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోర్లాపడింది. మితిమీరిన వేగానికి ఆరేళ్ల చిన్నారి బలి.. Tractor Accident minor dead: గేదెలొస్తున్నాయని భయపడి రోడ్డుపక్కనే ఆగిపోయిన ఆ చిన్నారిని ట్రాక్టర్‌రూపంలో దూసుకొచ్చిన మృత్యువు మింగేసింది. రోడ్డుపై వస్తున్న గేదెలను గమనించిన ఆ చిన్నారి.. దూసుకొచ్చిన ట్రాక్టర్ని చూడలేకపోయింది.యూపీ మూడో దశ పోలింగ్ ప్రశాంతం..UP polls third phase: ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 59 స్థానాల్లో ఓటింగ్ జరగగా.. సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 57 శాతం ఓటింగ్ నమోదైంది.పంజాబ్‌లో63 శాతం ఓటింగ్.. Punjab Assembly elections: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,304 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. సాయంత్రం ఐదు గంటల వరకు 63 శాతం పోలింగ్ నమోదైంది.పందిట్లో నుంచి ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్..Gang rape: పెళ్లి మండపం నుంచి ఓ 16 ఏళ్ల బాలికను అపహరించిన ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటన ఛత్తీస్‌గఢ్ జశ్‌పుర్ జిల్లాలో జరిగింది. ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులు.. బాలిక సొంత గ్రామానికి చెందిన వారేనని గుర్తించారు.బ్రిటన్ మహారాణి ఎలిజబెత్‌కు కరోనా.. Queen Elizabeth Tested Positive: బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-II కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ వెల్లడించింది.కొవిడ్ సోకినా ఐసోలేషన్ అక్కర్లేదు..Britain Covid Rules: కొవిడ్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి కొవిడ్ సోకిన వ్యక్తులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది. 'కొవిడ్‌తో సహజీవనం' ప్రణాళికలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.డిఫరెంట్‌గా గుజరాత్ జట్టు లోగో.. Gujarat Titans Logo: ఈ ఏడాది ఐపీఎల్లో అరంగేట్రం చేయనున్న గుజరాత్ టైటాన్స్(జీటీ) కొత్త ట్రెండ్ సెట్ చేసింది. మెటావర్స్‌లో తమ జట్టు లోగోను ఆవిష్కరించింది. ఇప్పటివరకు ఏ జట్టు చేయని ప్రయోగం చేసి.. అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.సమంత కోసం రూ.3 కోట్ల హోటల్..Samantha Yasodha: సమంత 'యశోద' కోసం అదిరిపోయే రేంజ్లో ఖర్చు చేస్తున్నారు. దాదాపు రూ.3 కోట్లు ఖర్చు చేసి 7 స్టార్ హోటల్ సెట్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఇందులోనే షూటింగ్ జరుగుతోంది.