ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..ఆ తల్లీకూతుళ్ల పోరాటం.. చిరస్మరణీయం.. Medaram Jatara 2022: శివసత్తుల పూనకాలు, పొర్లు దండాలు, బెల్లం ఘుమఘుమలు, బంగారం(బెల్లం) మొక్కులు.. వెరసి గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే వనదేవతల పండగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. కోరుకున్న కోర్కెలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా విలసిల్లే ఈ జాతర వెనుక చరిత్రాత్మక కథ ప్రచారంలో ఉంది.ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈసీ నోటీసులు..EC notice to Raja Singh: యూపీ ఓటర్లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలతో వీడియో చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. వీడియోలో ఓటర్లను బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు ఈసీ పేర్కొంది. దీనిపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.'ఆ ఎమ్మెల్యేను సీఎం కొట్టారు' అంటూ పోస్టు.. Post against YSRCP MLA Vasanth Krishna Prasad : ఆయన అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే. 'ఆయనపై ముఖ్యమంత్రి చేయి చేసుకున్నాడు' అంటూ సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన ఓ పోస్టు తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వ్యవహారం కాస్త సదరు ఎమ్మెల్యే వరకూ చేరింది. ఏపీలోని కృష్ణా జిల్లాలో చర్చనీయాంశమైన ఈ పోస్టు వ్యవహారం వెనక ఉన్న వ్యక్తులను గుర్తించే వేటలో ఉన్నారు పోలీసులు.పంజాబ్ చతుర్ముఖ పోరులో గెలిచేదెవరు?Punjab elections 2022: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. గతంలో కంటే భిన్నగా ఈసారి రాష్ట్రంలో చతుర్ముఖ పోటీ నెలకొంది. సంప్రదాయ పార్టీలైన కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ అధికారం కుస్తీ పడుతున్నాయి. 2017లో మాదిరిగానే భారీ షాకివ్వాలని ఆప్.. కూటమితో సత్తా చాటాలని భాజపా-పీఎప్సీ భావిస్తున్నాయి.భర్త కిడ్నాప్.. కూతురితో అడవిలోకి భార్య.. Chhattisgarh naxals news: నక్సల్స్ చెరలో ఉన్న తన భర్తను విడిపించుకునేందుకు ఓ మహిళ అడవి బాట పట్టింది. రెండున్నరేళ్ల కూతురితో దండకారణ్యంలోకి వెళ్లింది. అయితే, భర్తను మావోలు విడిచిపెట్టినా.. ఆమె అడవిలో నుంచి బయటకు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.19% తగ్గిన కరోనా కేసులు..WHO New COVID cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారంతో పోలిస్తే.. కేసులు 19 శాతం పడిపోయాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. మరణాల సంఖ్య స్థిరంగా ఉందని వెల్లడించింది.'ఇగ్లూ టౌన్'లా మారిపోయిన బీచ్.. Siberia igloo festival: సైబీరియాలోని ఓబీ సముద్ర తీరంలో నిర్వహించిన ఇగ్లూ ఫెస్టివల్ విశేషంగా ఆకట్టుకుంది. మంచు బ్లాకులతో ఇగ్లూలను నిర్మించేందుకు పోటీలు పడ్డారు పోటీదారులు. గత ఏడేళ్లుగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు నిర్వాహకులు.ఎల్‌ఐసీ వద్ద భారీగా క్లెయిం చేయని నిధులు..LIC IPO Unclaimed Funds: ఎల్‌ఐసీ త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఇటీవలే.. సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం వద్ద ఎవరూ క్లెయిం చేయని నిధులు రూ. 21 వేల కోట్లకుపైనే ఉన్నట్లు తెలిపింది.వార్నర్ భావోద్వేగ ట్వీట్.. David Warner IPL 2022: ఈ సారి ఐపీఎల్లో కొత్త జట్టుకు ఆడనున్న నేపథ్యంలో సన్‌రైజర్స్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు వార్నర్. విలియమ్స్‌న్ కూతురుతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసిన ఫొటోతో భావోద్వేగ ట్వీట్ చేశాడు. విలియమ్స్‌న్‌తో కలిసి ఆడే ఆవకాశం మిస్ అవుతున్నానని అన్నాడు.బప్పి సంగీతానికి మైకేల్ జాక్సన్ వీరాభిమాని..దిగ్గజ పాప్ సింగర్, డ్యాన్సర్ మైకేల్ జాక్సన్.. బప్పి లహిరికి వీరాభిమాని. ఈయన కంపోజ్ చేసిన 'జిమ్మీ జిమ్మీ' పాటను జాక్సన్, అప్పుడప్పుడూ పాడుతూ ఉండేవారు. 1989లో బీసీసీ లండన్‌లో జరిగిన లైవ్ ఫెర్ఫార్మెన్స్ షోలో పాల్గొన్న ఏకైన భారతీయ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహిరి. ఈయనను జొనాథన్ రాస్ ఆహ్వానించారు.