తెలంగాణ

telangana

ETV Bharat / city

Top News: టాప్​న్యూస్​ @7 PM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TELANGANA LATEST TOP NEWS
TELANGANA LATEST TOP NEWS

By

Published : Feb 15, 2022, 7:07 PM IST

  • గ్రంథంగా రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు..

Telangana Government Laws: రాష్ట్ర ప్రభుత్వ చట్టాలన్నీ త్వరలోనే ఒక గ్రంథంగా అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి అన్వయించుకున్న చట్టాలతో పాటు తెలంగాణ ఆవిర్భావం అనంతరం చేసిన చట్టాలను న్యాయశాఖ క్రోడీకరించింది. దాదాపుగా 300 చట్టాలతో కూడిన పుస్తకాలు త్వరలోనే అన్ని శాఖలకు అందుబాటులోకి రానున్నాయి.

  • కేసీఆర్‌ పోరాటానికి దేవెగౌడ మద్దతు..

Deve Gowda Support to CM KCR: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్​కు సర్వత్రా మద్ధతు లభిస్తోంది. తాజాగా మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్​డీ దేవెగౌడ... సీఎం కేసీఆర్ పోరాటానికి తన సంపూర్ణ మద్ధతు ప్రకటించారు.

  • కాంగ్రెస్​ను బలహీనపరిచేందుకే చర్చలు..

Revanth Reddy on CM KCR : కాంగ్రెస్​ను బలహీనపరిచేందుకే... తమ పార్టీకి అనుకూలమైన వారితో సీఎం కేసీఆర్‌ చర్చలు జరుపుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా, స్టాలిన్‌ను కాంగ్రెస్‌కు దూరం చేయాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే యూపీఏ, ఎన్డీయేతర సీఎంలతో చర్చించాలని అన్నారు.

  • నినాదాలు ఎన్నికల్లో గెలిపిస్తాయా?

punjab assembly election: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ.. యూపీ తర్వాత అంతటి ప్రాముఖ్యం ఉన్న రాష్ట్రం పంజాబ్​. అక్కడి రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో నినాదాలను బ్రహ్మాస్త్రాలుగా భావిస్తాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ పడి మరీ నినాదాలు ఇస్తున్నాయి పార్టీలు. ఆయితే రాజకీయ పక్షాలు ఇచ్చిన నినాదాలు ఏంటి? వాటిలో వివాదాస్పమైనవి ఉన్నాయా? ఎన్నికల్లో గెలుపునకు ఇవి​ దోహదం చేస్తాయా?

  • మతాచారాలు దేశ వైవిధ్యానికి చిహ్నం..

Karnataka High Court Hijab: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో మంగళవారం విచారణ కొనసాగింది. బహిరంగ ప్రదేశాల్లో మతాచారాలు పాటించడం వల్ల దేశ వైవిధ్యాన్ని చాటి చెప్పినట్లు అవుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. దీని వల్ల భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

  • టీ పొడి ధర కేజీ రూ.లక్ష..

Golden Pearl Tea: అసోం తేయాకుకు ఉన్న ప్రత్యేకత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడి తేయాకు పంటల నుంచే అత్యంత అరుదైన టీ పొడి లభిస్తుంది. ఇలా ఓ వెరైటీ టీ పొడికి వేలంలో రికార్డు ధర పలికింది. ఆ విశేషాలు మీకోసం..

  • భారత్‌లో విడుదలైన కియా 'కరెన్స్‌'..

Kia Carens 2022: దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ 'కియా' నుంచి సరికొత్త మోడల్​ 'కరెన్స్'​ను భారతీయ మార్కెట్​లో విడుదల చేసింది ఆ సంస్థ. కారు ఫీచర్లతో పాటు ధర వంటి వివరాలను మంగళవారం వెల్లడించింది.

  • భారత్​-శ్రీలంక సిరీస్​ షెడ్యూల్​లో మార్పు..

Srilanka vs India: లంక బోర్డు ప్రతిపాదన మేరకు టీమ్​ఇండియాతో జరగబోయే సిరీస్​ షెడ్యూల్​లో మార్పులు చేసింది బీసీసీఐ. టెస్టులతో కాకుండా టీ20లతో సిరీస్​ను ప్రారంభించబోతున్నట్లు బోర్డు తెలిపింది.

  • ఆస్కార్​ హోస్ట్​గా రెజీనా..

Oscars 2022: ఈ సారి ఆస్కార్​ 94వ ఎడిషన్ అకాడమీ అవార్డ్స్​ కార్యక్రమానికి ముగ్గురు హోస్టులుగా వ్యవహరించనున్నారు. వాండా సైక్స్, అమీ షుమెర్, రెజీనా హాల్​లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

  • ఆమిర్​ కోసం 'ఆదిపురుష్'​ పోస్ట్​పోన్​​..

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో ప్రభాస్​ 'ఆదిపురుష్'​, ఆమిర్ ఖాన్​ 'లాల్​సింగ్​చద్ధా', అక్షయ్​కుమార్​ 'బచ్చన్​పాండే' చిత్రాల సంగతులు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details