తెలంగాణ

telangana

ETV Bharat / city

Top News: టాప్​టెన్​ న్యూస్​@ 1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TELANGANA LATEST TOP NEWS
TELANGANA LATEST TOP NEWS

By

Published : Feb 15, 2022, 12:58 PM IST

  • 'యూపీలో భాజపాకు ఓటేయకపోతే..'

Raja Singh Controversy : గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్​ ప్రదేశ్​ ఎన్నికల పోలింగ్​లో భాజపాకు ఓటు వేయని వారి ఇళ్లపైకి బుల్డోజర్లను, జేసీబీలను పంపిస్తామని హెచ్చరించారు. యోగి ఆదిత్యనాథ్​కు ఓటు వేయని వాళ్లంతా యూపీ నుంచి వెళ్లిపోవాలని అన్నారు.

  • కేసీఆర్‌ గారూ.. ఇదిగో సాక్ష్యం..

Assam cm tweet about KCR : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా కొనసాగుతోంది. కేసీఆర్‌ వ్యాఖ్యల వీడియోను జత చేస్తూ ‘విపక్షం మెరుపు దాడుల గురించి ప్రశ్నిస్తూ.. అమరవీరులను అవమానించేందుకు పూనుకుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోమవారం ఉదయం ట్విటర్‌లో స్పందించారు.

  • జనం మెచ్చిన సేద్యం..!

Training for Terrace Gardening : హైదరాబాద్​లో సేద్యం రోజు రోజుకూ విస్తరిస్తోంది. ఏ మాత్రం అవకాశం ఉన్నా.... ఖాళీ జాగాలు, డాబాలపై కూరగాయలు, ఆకుకూరలు పండించేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యానశాఖ నిర్వహిస్తున్న టెర్రస్‌ గార్డెనింగ్‌ శిక్షణ కార్యక్రమాలకూ విశేష స్పందన లభిస్తోంది.

  • భారతీయులకు కేంద్రం అలర్ట్!

Indians to leave Ukraine: ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. భారత్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్​లో ఉంటున్న భారతీయులు.. ముఖ్యంగా విద్యార్థులు తక్షణం స్వదేశానికి రావాలని సూచించింది.

  • దాణా స్కామ్​ ఐదో కేసులోనూ లాలూ దోషి

Fodder scam: దాణా కుంభకోణం కేసులో ఆర్​జేడీ అధినేత, బిహార్​ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్​ యాదవ్​ దోషిగా తేలారు. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఈమేరకు తీర్పు చెప్పింది. ఫిబ్రవరి 18న ఆయనకు శిక్ష ఖరారు చేయనుంది. ఈ కేసులో మరో 36 మందికి మూడేళ్ల చొప్పున శిక్ష ఖరారు చేసింది సీబీఐ స్పెషల్​ కోర్టు.

  • 41రోజుల్లో 28సార్లు పాజిటివ్!

Dead body tested positive for covid : సముద్రంలో మునిగి చనిపోయిన వ్యక్తి మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించిన పరిశోధకులు.. ఆశ్చర్యకర విషయాలు వెల్లడించారు. 41 రోజుల్లో 28సార్లు టెస్ట్ చేయగా.. ప్రతిసారీ కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. మృతదేహాల్లో కరోనా వైరస్ ఎంతకాలం సజీవంగా ఉంటుందనే అంశంపై మరింత పరిశోధన జరపాల్సిన అవసరాన్ని ఇది తెలియచెబుతోందని అభిప్రాయపడ్డారు.

  • మంచుతో 'తాజ్​మహల్​'- ప్రేమజంటల క్యూ

Taj Mahal Snow Sculpture: లవర్స్​ డే సందర్భంగా ఆగ్రాలోని తాజ్‌మహల్‌ వద్ద ప్రేమజంటలు సరదాగా గడిపిన సమయంలోనే గుల్మార్గ్‌లోనూ పర్యటకులు సందడి చేశారు. ఇక్కడో తాజ్​మహల్​ ఉంది మరి. అలాంటిదిలాంటిది కాదు.. మంచు తాజ్​మహల్​. 16 అడుగుల పొడవు.. 24 అడుగుల విస్తీర్ణంలో అద్భుత రూపం ఇచ్చారు కళాకారులు.

  • భారీ లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

సోమవారం సెషన్​లో భారీ నష్టాలను చవిచూసిన స్టాక్​ మార్కెట్లు.. మంగళవారం భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 779 పాయింట్లకుపైగా పెరిగి.. 57,185 వద్ద కదలాడుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 223 పాయింట్ల లాభంతో.. 17,067 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

  • పంచ్ లు కురిపించేందుకు 'గని' సిద్ధం

Gani Movie Release: ఫిబ్రవరి 25న 'గని' మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు చిత్ర బృందం మంగళవారం తెలిపింది.

  • కెప్టెన్​గా బాబర్ అజామ్..

పాకిస్థాన్​ సూపర్ లీగ్​ 2022లో కరాచీ కింగ్స్​కు మళ్లీ నిరాశే ఎదురైంది. బాబర్ కెప్టెన్​గా వ్యవహరిస్తున్న ఈ టీం.. వరుసగా ఏడో మ్యాచ్​లోనూ ఓడిపోయింది.

ABOUT THE AUTHOR

...view details