తెలంగాణ

telangana

ETV Bharat / city

Top News Today: టాప్​న్యూస్​ @ 9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana latest top news
Telangana latest top news

By

Published : Jan 9, 2022, 8:58 AM IST

  • జాతీయ రహదారిపై వాహనాల రద్దీ

Traffic at Hyderabad-Vijayawada Highway : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. పండుగ ఇంకా వారం ఉండగానే జనం పల్లెబాటపడుతున్నారు. ఇక శనివారం నుంచి విద్యార్థులకు సెలవులు రావడంతో భారీ సంఖ్యలో ఊరెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది.

  • నేడు, రేపు వడగళ్ల వర్షాలు

Telangana Rains Today : గత కొన్ని రోజులుగా చలిగాలులతో గజగజలాడుతున్న రాష్ట్ర ప్రజలను వరుణుడు పలకరించనున్నాడు. నేడు, రేపు రాష్ట్రంలో పలు చోట్ల వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

  • పండక్కి ఊరెళ్తున్నారా..?

Essential Precautions: సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామాలకు పయనవుతున్న నగరవాసులకు ఇల్లు గుల్లవుతుందేమోనని భయం పట్టుకుంది. నగర శివారు ప్రాంతాలతో పట్టపగలే చోరీలు జరుతున్న వార్తలు విని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కొంతమంది అయితే ఇంటికి తాళం వేసి పండుగకు వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలోపడ్డారు. 3 కమిషనరేట్ల పరిధిలో ఊరికి వెళ్లే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు ఇప్పటికే ప్రకటనలు విడుదల చేశారు.

  • యూపీపైనే అందరి కళ్లు

5 States Election In 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు శంఖారావం మోగింది. ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​ విడుదలైంది. అయితే ప్రధానంగా ఉత్తర్​ప్రదేశ్​ తీర్పుపైనే అందరి కళ్లు ఉన్నాయి. సాగుచట్టాలను కేంద్ర సర్కారు ఉపసంహరించుకున్న తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం వల్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  • ఆ స్టేషనల్లో అమలు

Indian Railways New Charges: డెవలప్‌మెంట్‌ ఫీజు (ఎస్‌డీఎఫ్‌)ను ప్రయాణికుల నుంచి వసూలు చేయనునుంది రైల్వే శాఖ. పునరాభివృద్ధి చేసిన స్టేషన్లు అందుబాటులోకి వచ్చాక.. బుకింగ్‌ సమయంలోనే ఈ మొత్తాన్ని టికెట్‌తోపాటు వసూలు చేయనున్నారు. రూ.10 నుంచి రూ.50 మేర ఈ మొత్తం ఉంటుంది.

  • విరిగిపడిన కొండచరియలు.. ఏడుగురు మృతి

Cliff Collapse Brazil: బ్రెజిల్‌లోని జలపాతం వద్ద రాతి పెచ్చులు ఊడి మోటర్‌బోటులపై పడిన ఘటనలో ఏడుగురు మరణించగా.. 32 మంది గాయపడ్డారు. మరో 20 అదృశ్యమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

  • 'సినిమాలు వదిలేద్దామనుకున్నా..'

Nagarjuna Bangarraju movie: గడిచిన నాలుగేళ్లలో చాలా ఒడుదొడుకులను ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకున్నారు దర్శకుడు కల్యాణ్​కృష్ణ. ఆ సమయంలో సినిమాలు వదిలేద్దామన్నా ఆలోచన వచ్చిందని, అప్పుడు హీరో నాగార్జున తనకు అండగా నిలిచారని అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన 'బంగార్రాజు' సినిమా జనవరి 14న రిలీజ్​ కానుంది. ఈ సందర్భంగా కెరీర్​ సహా చిత్ర విశేషాలను తెలిపారాయన. ఆ సంగతులను చూసేద్దాం..

  • టైటిల్‌ పోరుకు బోపన్న జోడీ

Bopanna Ramkumar Pair: అడిలైడ్‌ ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో ఫైనల్​కు దూసుకెళ్లింది రోహన్‌ బోపన్న-రామ్‌కుమార్‌ రామనాథన్‌ జోడీ. ఆదివారం జరిగే టైటిల్‌ సమరంలో టాప్‌సీడ్‌ ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా)-మార్సెలో మెలో (బ్రెజిల్‌)తో బోపన్న జంట అమీతుమీ తేల్చుకోనుంది. ఓ ఏటీపీ టోర్నీలో వీరిద్దరూ కలిసి ఆడటం ఇదే తొలిసారి.

  • జకోవిచ్ తీరుపై విమర్శలు

Djokovic Corona: నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జకోవిచ్​ ఆస్ట్రేలియా ఓపెన్​లో పాల్గొనేందుకు వెళ్లగా వాక్సినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు లేని కారణంగా అతడిని ఎయిర్​పోర్ట్ అధికారులు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న జకోవిచ్‌ ఆస్ట్రేలియా అధికారుల తీరుపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాడు. ఈ క్రమంలోనే శనివారం తన లాయర్ల ద్వారా వాదనలు వినిపించాడు జకోవిచ్. డిసెంబర్ 16న అతడికి కరోనా సోకిందని అందుకే మినహాయింపు ఇవ్వాలని లాయర్లు కోరారు. కానీ డిసెంబర్ 17న అతడు మాస్క్ లేకుండా పలు ఈవెంట్లలో పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.

  • రిలయన్స్‌ చేతికి న్యూయార్క్‌ హోటల్‌

అమెరికాలోని అత్యంత విలాసవంతమైన ఓ హోటల్‌లో మెజారిటీ వాటాను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సొంతం చేసుకుంది. 'మాండరిన్‌ ఓరియంటల్‌ న్యూయార్క్‌' హోటల్‌లో 73.37 శాతం వాటా కొనుగోలు చేయడానికి రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ హోల్డింగ్స్‌(ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌) సంతకాలు చేసినట్లు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details