ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలున్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్నారా.. New Year Restrictions in Hyderabad: కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారా? అయితే... ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఓఆర్ఆర్పై కార్లకు అనుమతి నిరాకరించారు. పలు ప్రాంతాల్లో పైవంతెనలు మూసివేస్తున్నట్లు ప్రకటించగా.. కొన్ని చోట్ల దారి మళ్లించినట్లు చెప్పారు.'మళ్లీ మేమే వస్తాం.. ఐటీ హబ్‌ను ప్రారంభిస్తాం'IT Hub in Nalgonda: ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ సేవలు విస్తరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. నల్గొండలో ఐటీ హబ్ ద్వారా స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. పట్టణంలో మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఐటీ హబ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలను ఆయన ప్రారంభించారు.'ఫ్లొరోనా' పేరుతో కొత్త వ్యాధి- Israel Florona disease: ఇజ్రాయెల్‌లో ఫ్లొరోనా వ్యాధి కలకలం రేపుతోంది. ఆ దేశంలో తొలి కేసు వెలుగు చూసింది.14 ఏళ్ల దివ్యాంగురాలిపై గ్యాంగ్ రేప్.. Madhya Pradesh gang rape: 14 ఏళ్ల దివ్యాంగ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కిరాతకులు. నిందితుల్లో 60 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నాడు. బాలిక అస్వస్థతకు గురైన తర్వాత వైద్య పరీక్షలు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.విద్యుత్ బోటులో తొలి రైడ్! Electrical boat: బ్యాటరీతో నడిచే కార్లు, బైకుల గురించి మనకు తెలుసు. అయితే... బ్యాటరీతో నడిచే బోటును ఎప్పుడైనా చూశారా? కేరళకు వెళ్తే అక్కడి 'వాటర్ మెట్రో ప్రాజెక్టు'లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ తరహా బోటును మనం చూడొచ్చు. ఈ విద్యుత్ బోటులో బోలెడన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటంటే..?ఆ రెండు కంపెనీలకు రూ.1000 కోట్లు ఫైన్!'IT Raids on Foreign Companies: దేశంలో విదేశీ నియంత్రణలో ఉన్న మొబైల్ కంపెనీలు వేలకోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడినట్లు ఐటీ శాఖ గుర్తించింది. లెక్కకురాని రూ.6,500 కోట్ల లావాదేవీలను గుర్తించింది.సిడ్నీలో అంబరాన్నంటిన న్యూ ఇయర్ వేడుకఆస్ట్రేలియాలో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. సిడ్నీలో కన్నుల పండువగా బాణసంచా పేల్చి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు ప్రజలు. ఏటా ఇక్కడ న్యూ ఇయర్ వేడుకలను భారీ ఎత్తున నిర్వహిస్తారు. వీటిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రపంచదేశాల నుంచి పర్యటకులు కూడా వస్తుంటారు.2022కి న్యూజిలాండ్ స్వాగతంNew zealand welcomes new year: 2022 సంవత్సరానికి న్యూజిలాండ్ ఘనంగా స్వాగతం పలికింది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతుల వెలుగుల్లో ఆక్లాండ్ నగరం మెరిసిపోయింది. కేరింతలు కొడుతూ, బాణసంచా కాల్చి ఆక్లాండ్ నగర వాసులు సంబరాలు జరుపుకున్నారు. దీంతో ప్రపంచంలోనే 2022 ఏడాదికి స్వాగతం పలికిన తొలిదేశంగా న్యూజిలాండ్ నిలిచింది.'లా లా భీమ్లా' పాట డీజే వెర్షన్ ఆగయా..అభిమానుల్లో ఇప్పటికే అలరిస్తున్న 'లాలా భీమ్లా' సాంగ్.. సరికొత్తగా డీజే వెర్షన్ కూడా వచ్చేసింది. శుక్రవారం సాయంత్రం ఈ పాట రిలీజైంది.దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు రోహిత్ దూరం.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ దూరమయ్యాడు. తొడ కండరాల సమస్య నుంచి ఇంకా అతడు కోలుకోలేదు. దీంతో కేఎల్ రాహుల్.. కెప్టెన్‌గా బాధ్యతలు అందుకోనున్నాడు. బుమ్రా వైస్ కెప్టెన్సీ చేయనున్నాడు.