కరోనా పరిస్థితులపై కేసీఆర్ సమీక్ష
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సీఎంలతో మోదీ భేటీ..
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ భేటీ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'టీకాలు వృథా చేసిన మహారాష్ట్ర'
మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల కరోనా టీకా డోసుల్ని వృథా చేసిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఆరోపించారు. కరోనా టీకాల కొరత కారణంగా వ్యాక్సినేషన్ కేంద్రాల్ని మూసివేయాల్సి వస్తోందని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే బుధవారం చేసిన వ్యాఖ్యలపై.. ప్రకాశ్ జావడేకర్ ఈమేరకు స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రూ.2వేల కోట్లతో విద్యాపథకం
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధిపై హైదరాబాద్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఉప సంఘం చర్చించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కోబ్రా జవాన్ విడుదల
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భీకర ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌కు విముక్తి లభించింది. ఐదు రోజుల తర్వాత నక్సల్స్ ఆ జవానును విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.