నిరాడంబరంగానే ఉగాది వేడుకలు..
కరోనా వ్యాప్తి దృష్ట్యా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ఏడాది ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రతి గ్రామానికీ టీ-ఫైబర్ సేవలు!
బ్రాడ్ బ్యాండ్ సౌకర్యాన్ని ఒక యుటిలిటీగా పరిగణించి.. పట్టణాల్లోని ప్రతి ఇంటికీ అనుసంధానించే విధానాన్ని అధ్యయనం చేయాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశించారు. మిషన్ భగీరథ పనులు పూర్తైన గ్రామీణ ప్రాంతాల్లో టీ- ఫైబర్ పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఆగస్టు నాటికి ప్రతీ గ్రామానికి టీ-ఫైబర్ కనెక్టివిటీ ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అధికారులు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
హనుమంతుడు పుట్టింది.. తిరుమలగిరులలోనే..!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల క్షేత్రం ఇకపై హనుమంతుని జన్మస్థానంగానూ గుర్తింపు పొందనుంది. ఏప్రిల్ 13న తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఈ విషయాన్ని పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపించేందుకు తితిదే సిద్ధమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
గురు తేగ్ బహదూర్‌పై మోదీ
గురు తేగ్ బహదూర్ ప్రభావం లేకుండా నాలుగు శతాబ్దాలలో భారత్ చరిత్రను ఊహించలేమని ప్రధాని మోదీ అన్నారు. ఆయన నేర్పిన పాఠాలు, సిక్కు గురు సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మహారాష్ట్ర మాజీ హోంమంత్రికిషాక్
సీబీఐ విచారణను సవాలు చేస్తూ మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణల స్వభావాన్ని బట్టి.. ఆయనపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.