25 కిలోల బంగారం స్వాధీనం..
హైదరాబాద్ నగర శివారుల్లో పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో రూ.11.63కోట్లు విలువైన 25కిలోల బంగారాన్ని పట్టుకున్నామని డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా
కరోనా తీవ్రత కారణంగా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
భారత్‌లో కరోనా కొత్త వేరియంట్!
మరో కరోనా డబుల్ మ్యూటెంట్ వేరియంట్‌ను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఉన్న వైరస్ విజృంభణకు కారణం ఈ వేరియంటే అనే విషయంపై స్పష్టత లేదని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సెన్సెక్స్ పతనం..
కరోనా భయాలు మార్కెట్లను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు బుధవారం సెషన్‌ను నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్ 871 పాయింట్లు కోల్పోయి.. 49,180 పాయింట్ల వద్ద ముగిసింది. 265 పాయింట్లు పతనమైన నిఫ్టీ.. 14,549 వద్ద స్థిరపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పాలేరు నుంచి బరిలో షర్మిల!
షర్మిలను ఖమ్మం జిల్లా వైఎస్‌ఆర్ అభిమానులు కలిశారు. పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల తెలిపిందని వైఎస్‌ఆర్ అభిమానులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
విజయన్ ఆవేదన.. షా హామీ
ఉత్తర్‌ప్రదేశ్‌లో క్రైస్తవ సన్యాసినులపై భజరంగ్ దళ్ కార్యకర్తల 'వేధింపుల' ఘటన రాజకీయ దుమారానికి కారణమైంది. ఇలాంటి ఘటనల వల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బతింటుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హోం మంత్రి అమిత్ షా.. హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
1800 కేజీల బంగారం విరాళం
ప్రముఖ వైష్ణోదేవి ఆలయానికి గత 20 ఏళ్లలో 1800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండి, రూ. 2000 కోట్ల నగదు విరాళంగా అందాయి. స.హ చట్టం దరఖాస్తు ద్వారా ఈ విషయం తెలిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఐసీసీ ర్యాంకింగ్స్..
టీ20తో పాటు వన్డే ర్యాంకింగ్స్‌ను ఐసీసీ ప్రకటించింది. తాజా ర్యాంకింగ్స్‌లో భారత సారథి విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్లో నాలుగో స్థానంలో, వన్డేల్లో అగ్రస్థానంలో ఉన్నాడు. వైస్ కెప్టెన్ రోహిత్ టీ20ల్లో 14వ స్థానంలో కొనసాగుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
క్రికెట్లో యథాతథంగా..
డీఆర్ఎస్ విధానంలో భాగంగా క్రికెట్లో 'అంపైర్స్ కాల్' నిబంధన ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసింది. సాంకేతికత సాయంతో తనిఖీ చేసే బాల్ ట్రాకింగ్ విధానం 100 శాతం సరైనదని చెప్పలేమంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సోదరుడు మృతి
ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సోదరుడు, ప్రముఖ నిర్మాత కోవెలమూడి కృష్ణమోహన్ రావు అనారోగ్య సమస్యలతో బుధవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.