- ధన్యవాదాలు చెప్పిన కేటీఆర్..
ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటుహక్కు వినియోగించుకోవాలన్న తమ విజ్ఞప్తికి స్పందించిన ప్రతి ఒక్క విద్యావంతునికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ యంత్రాంగం మొత్తం గత రెండు వారాలుగా ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిందని... పార్టీ ప్రయత్నాలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని కేటీఆర్ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విజయంపై బండి ధీమా..
కోట్లు ఖర్చు పెట్టినా.. తెరాసకు రెండో స్థానం కూడా దక్కదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో భాజపాదే విజయమని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశాన్ని విభజించే శక్తులతో..
దేశ విభజనకు యత్నించే శక్తులతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంటోందని ఆరోపించారు కేంద్ర హోంత్రి అమిత్ షా. అసోం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్ చేతిలో అసోం సురక్షితంగా ఉండదని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'పట్టపగలే మోదీ సర్కార్ దోపిడీ'
2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం.. పెట్రోల్‌పై పన్నులు విధిస్తూ రూ.21లక్షల కోట్లు వసూలు చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. గ్యాస్, డీజల్, పెట్రోల్ ధరలు పెంచి కేంద్ర పట్టపగలే ప్రజలను దోచుకుంటోందని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గాయపడిన పులి..
తన జీవితంలో ఎన్నో దాడులను ఎదుర్కొన్నానని, ఇప్పటివరకు ఎవరికీ తలొగ్గలేదని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తన కాలికి అయిన గాయాన్ని ఉద్దేశిస్తూ గాయపడిన పులి మరింత ప్రమాదకరమని అన్నారు. వీల్ ఛైర్‌లోనే తన ప్రచారాన్ని కొననసాగిస్తానని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 7 గంటల్లో 7 వేల కిలోల వంటకం