- 75వ స్వాతంత్య్ర వేడుకలకు..
75వ స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో 259 మందితో ఉన్నత స్థాయి జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించే ఈ కమిటీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, నటులు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, దర్శకుడు రాజమౌళి, క్రీడాకారిణిలు పీవీ సింధు, మిథాలి రాజ్‌కు చోటు కల్పించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వందో రోజుకు రైతు ఉద్యమం
రైతు ఉద్యమం నేటితో 100 రోజులు పూర్తిచేసుకుంటుంది. భవిష్యత్తులో మరింత పటిష్ఠంగా ఉద్యమం చేపడతామని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. ఆందోళనలకు 100 రోజులైన నేపథ్యంలో ఇవాళ బ్లాక్ డే పాటిస్తున్నారు. 5 గంటల పాటు దిల్లీలోని కుండ్లీ మనేసర్ పల్‌వాల్ ఎక్స్‌ప్రెస్ హైవేను దిగ్బంధిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఘన విజయం సాధించాల్సిందే..
నాగార్జున సాగర్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని తెరాస శ్రేణులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఎర్రవల్లిలోని తన నివాసంలో పార్టీ ఇన్‌ఛార్జులతో సాగర్ ఉపఎన్నికపై.... సీఎం సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గతేడాది హైదరాబాద్ వరదలపై ..
గతేడాది హైదరాబాద్‌లో భారీ వరదలకు ఆక్రమణలే కారణమని నీతి ఆయోగ్ తేల్చి చెప్పింది. జలవనరులను ఆక్రమించడం వల్లే గతేడాది అక్టోబరులో ఉత్పాతం సంభవించిందని పేర్కొంది. హుస్సేన్‌సాగర్ గట్లు, నాలాలన్నీ కబ్జాలకు గురవడమే సమస్యకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేడు ఎంసెట్ షెడ్యూల్!
ఎంసెట్ షెడ్యూల్ ఇవాళ ఖరారు కానుంది. నేడు జరగనున్న ఎంసెట్ కమిటీ కమిటీ సమావేశం అనంతరం... నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, తదితర తేదీలను ప్రకటించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'చైనా దూకుడుకు నిదర్శనం'