భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు..
పీఆర్సీ కమిటీ నివేదికపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. 7.5 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్న కమిటీ సిఫార్సులను తప్పుపడుతూ... ఆందోళనలకు దిగాయి. నివేదిక ప్రతులను తగులబెట్టి.... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఫిట్మెంట్ డిమాండ్లు..
సీఎం కేసీఆర్‌పై తమకు నమ్మకం ఉందని... ఆయన ఉద్యోగుల పక్షానే ఉంటారని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. పీఆర్సీ అడ్వైజరీ కమిటీ మాత్రమేనని అన్నారు. గతంలో ఇచ్చిన ఫిట్మెంట్ కంటే తగ్గకుండా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మార్కెట్లో ముఖ్యమంత్రి..
సిద్దిపేట వంటిమామిడి కూరగాయల మార్కెట్‌ను సీఎం కేసీఆర్ పరిశీలించారు. మార్కెట్లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నెలాఖరులోపు పదోన్నతులు!
పదోన్నతుల ప్రక్రియపై అన్నిశాఖల కార్యదర్శులతో సీఎస్ సోమేశ్‌కుమార్ సమీక్షించారు. నెలాఖరులోపు పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. ఎక్కువ మందికి పదోన్నతులు లభించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రైతు ఉద్యమానికి బీటలు!
ట్రాక్టర్ ర్యాలీ నిరసనలతో దద్దరిల్లిన దిల్లీలో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హింసాకాండకు సంబంధించి పోలీసులు 22 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మంగళవారం జరిగిన బీభత్సానికి కారణమైన వారిపై చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దిల్లీలో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. మరోవైపు హింసాత్మక ఘటనలతో రైతు సంఘాల్లో చీలిక ఏర్పడినట్టు కనిపిస్తోంది. పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.