ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలుభారత్ బయోటెక్ నుంచి టీబీ వ్యాక్సిన్ కరోనా వంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు టీకాలు తీసుకువచ్చిన భారత్ బయోటెక్ సంస్థ టీబీ వ్యాక్సిన్ ఆవిష్కరించే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. స్పానిష్ సంస్థ బయోఫ్యాబ్రితో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుని.. (ఎంటీబీ వ్యాక్) యూనివర్సిటీ ఆఫ్ జరగోజా, ఐఏవీఐ (ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనీషియేటివ్), ట్యూబర్ క్యులోసిస్ వ్యాక్సిన్ ఇనీషియేటివ్ (టీబీవీఐ) సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు.వరకట్న వేధింపులతో బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్యDowry Harassment: వరకట్న వేధింపులకు నాలుగు నెలల గర్భిణి బలైంది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాధితులు ఫిర్యాదుతో ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.నౌకాదళ విన్యాసాలు Indian Navy maneuvers : ఫిబ్రవరి నెలలో జరిగిన భారత నౌకాదళ విన్యాసాలపై ఇండియన్ నేవి ఓ లఘు చిత్రాన్ని విడుదల చేసింది. నౌకాదళ కమాండోల సాహస కృత్యాలు, కవాతుల ప్రదర్శన, యుద్ధనౌకల విన్యాసాలు, సబ్‌మెరైన్‌ల పనితీరును మొత్తం 35 కెమెరాలతో చిత్రికరించారు.రూ.3,600 కోట్ల కుంభకోణంShashi Kant Sharma: రూ.3,600 కోట్ల కుంభకోణానికి సంబంధించిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో రక్షణశాఖ మాజీ కార్యదర్శిపై సీబీఐ ఛార్జ్‌షీటు దాఖలు చేసింది.రూ.75 లక్షలకే కశ్మీర్‌ను అమ్మేసిన బ్రిటిష్ ప్రభుత్వం Azadi Ka Amrit Mahotsav treaty of amritsar: భారత ఉపఖండాన్ని నేటికీ వెంటాడుతున్న అనేక సమస్యలకు మూలాలు ఆంగ్లేయుల పాలనలో ఉన్నాయి. వాటిలో ఒకటి జమ్మూ కశ్మీర్! ఆంగ్లేయుల కనుసన్నల్లో జమ్మూ కశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన తీరు ఆసక్తికరం. అధికార విస్తరణ, రాజకీయ ఎత్తుగడలు... డబ్బు యావతో జమ్మూ కశ్మీర్‌ను రూ. 75 లక్షలకు అమ్మేసింది బ్రిటిష్ ప్రభుత్వం.ఓటీటీలోకి కరీనాPrabhas Upcoming Movie: వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుండటం వల్ల వెండితెరపై ప్రభాస్‌ను చూడాలంటే ఏళ్ల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది! దీంతో మారుతి దర్శకత్వంలో చేయబోయే సినిమా షూటింగ్‌ను త్వరితగతిన పూర్తి చేసి.. ఫ్యాన్స్‌ను అలరించాలని భావిస్తున్నారు ప్రభాస్. ఈ సినిమా సహా కరీనా కపూర్, టైగర్ ష్రాఫ్, అజయ్ దేవ్‌గణ్ కొత్త చిత్రాల విశేషాలపై ఓ లుక్కేయండి.రెండో రౌండ్‌కు సింధు, సైనా All England Championships: ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణులు పి.వి.సింధు, సైనా నెహ్వాల్.. రెండో రౌండుకు దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్.. టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సన్ చేతిలో పరాజయం పాలయ్యాడు.పేపర్ మీద 'సూపర్‌హిట్' టీమ్.. 2022 Lucknow Super Gaints: కెప్టెన్.. వికెట్ కీపర్.. ఓపెనర్.. ఇలా మూడు రకాలుగా ఉపయోగపడే ఆటగాడు ఓ వైపు.. బ్యాటింగ్, బౌలింగ్‌తో అదరగొట్టే ఆల్‌రౌండర్ మరోవైపు.. మణికట్టుతో మాయ చేస్తున్న స్పిన్నర్ ఇంకోవైపు.. ఇలా మెగా వేలానికి ముందే ముగ్గురు కీలక ఆటగాళ్లను సొంతం చేసుకున్న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఐపీఎల్ అరంగేట్రంలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. రోజుకు ఎన్ని జీబీల డేటా వాడేస్తున్నారో తెలుసా? Mobile broadband index report 2022: ప్రస్తుత రోజుల్లో భారత్‌లో మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఫోన్లలో ఇంటర్నెట్ను ఎక్కుగానే వాడుతున్నారు. సగటున యువతరమైతే రోజుకు 8 గంటలు ఆన్లైన్లో గడుపుతుందని 'మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్ రిపోర్టు 2022' తెలిపింది. ఒక్కొక్కరు 17జీబీ డేటాను వాడుతున్నారని ఈ రిపోర్టులో పేర్కొంది.దేశార్థికానికి అనర్థంUkraine Russia War: ఉక్రెయిన్ రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. భారత్ కూడా అందుకు మినహాయింపు కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. ముఖ్యంగా చమురు, వంటనూనెలు, బంగారం ధరలు మరింత పెచ్చరిల్లుతాయని నిపుణుల అంచనా. ఈ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే.. భారత్‌కు సంబంధించి వ్యూహాత్మక, ఆర్థిక, రాజకీయ, సైనిక అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు.