రాష్ట్రంలోని న్యాయస్థానాల లాక్ డౌన్ జూన్ 6 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు, జిల్లా, మేజిస్ట్రేట్ కోర్టుల్లో జూన్ 6 వరకు కేసుల విచారణ కొనసాగదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అత్యవసర కేసుల విచారణ ఆన్ లైన్లో కొనసాగించాలని పేర్కొంది.
జూన్ 6వరకు రాష్ట్రంలో న్యాయవ్యవస్థ లాక్‌డౌన్ - telangana high court
రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ లాక్‌డౌన్ జూన్ 6 వరకు హైకోర్టు పొడిగించింది. అత్యవసర కేసులు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని జిల్లా కోర్టులకు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టుల్లో మాస్కులు, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
hc
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కోర్టులు మినహా మిగతా కోర్టుల్లో పిటిషన్లను ఆన్ లైన్తో పాటు నేరుగా దాఖలు చేసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టుల్లో మాస్కులు, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా న్యాయాధికారులను ఆదేశించింది. కలెక్టర్ల సహకారంతో కోర్టుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని.. క్రిమి సంహారక మందులు చల్లించాలని తెలిపింది.
Last Updated : May 29, 2020, 5:51 PM IST