తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి : కోదండరాం - ఉద్యోగ క్యాలెంటర్ విడుదలకు కోదండరాం డిమాండ్​

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు క్యాలెండర్​ విడుదల చేసి, తక్షణమే భర్తీ చేయాలని తెజస అధ్యక్షుడు కోడండరాం​ డిమాండ్​ చేశారు. మద్ధతు ధరకు పంటను కొనుగోలు చేయడం వల్ల నష్టం వచ్చిందని సీఎం చెప్పడంపై మండిపడ్డారు.

telangana janasamithi president kodandaram demand for recriutments
ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి : కోదండరాం

By

Published : Dec 29, 2020, 12:49 PM IST

Updated : Dec 29, 2020, 2:35 PM IST

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌ చేశారు. ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయడం వల్ల ఏడున్నర వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్​ చెప్పడంపై మండిపడ్డారు.

భారీ వర్షాలకు తీవ్రంగా పంట నష్టం జరిగిందని.. మరోవైపు మార్కెట్‌లో ధర లేక రైతులు నష్టపోయారని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. బతుకుదెరువు నిలబెట్టాలి-తెలంగాణను కాపాడాలి అనే నినాదంతో జనవరి 3, 4 తేదీల్లో నిరాహారదీక్ష చేయనున్నట్టు వెల్లడించారు.

ఇదీ చూడండి:రాజకీయ పార్టీ ప్రకటించట్లేదు: రజనీ

Last Updated : Dec 29, 2020, 2:35 PM IST

ABOUT THE AUTHOR

...view details