తెలంగాణ

telangana

ETV Bharat / city

పార్టీ బలోపేతానికి తెజస తీర్మానాలు - తెలంగాణ జన సమితి

రాష్ట్రంలో తెజసని బలోపేతం చేసి రాజకీయ ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుంచేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోదండరాం సూచించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కార్యాచరణ రూపకల్పన, నిర్మాణంపై రాష్ట్ర కమిటీ సమావేశమైంది. పార్టీ బలోపేతానికి తీర్మానాలు చేశారు.

kodandaram
kodandaram

By

Published : Feb 11, 2020, 8:44 PM IST

ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కార్యాచరణ రూపకల్పన, నిర్మాణంపై తెలంగాణ జన సమితి రాష్ట్ర కమిటీ సమావేశమైంది. కోదండరాం అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ రాష్ట్ర కమిటీ నేతలు హాజరై రాజకీయ పరిస్థితులపై చర్చించారు. దిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అరవింద్‌ కేజ్రీవాల్‌కు కోదండరాం అభినందనలు తెలిపారు. అనంతరం పార్టీ బలోపేతానికి సంబంధించి పలు తీర్మానాలు చేశారు.

  1. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను సమీకరించాలి
  2. రైతుల సమస్యలు, పంటకు గిట్టుబాటు ధరలపై వరంగల్, ఖమ్మంలో మార్కెట్ యార్డుల సందర్శన, ఆందోళనలు
  3. అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జీలను నియమించి... ప్రజా ఉద్యమాలను నిర్మించటం
  4. మద్యపానంపై నియంత్రణ, బెల్ట్ షాపులను తొలగించాలని సదస్సులు, ఆందోళనలు చేపట్టాలి
  5. ప్రభుత్వ పథకాలు అందరికి అందించాలని ఉద్యమం
  6. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్​పై ఖమ్మం, మహబూబ్​నగర్, నల్గొండలో సదస్సులు
  7. కార్పొరేట్ విద్య ఫీజుల దోపిడీ, వసతుల కల్పన ప్రభుత్వ నిర్లక్ష్యంపై జిల్లాల్లో పోస్టర్ల ఆవిష్కరణ, నిరసనలు
  8. తెజస సాంస్కృతిక విభాగం ద్వారా ప్రభుత్వ విధానాలపై ప్రజలను చైతన్యం చేయటం

ABOUT THE AUTHOR

...view details