ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను తెరాస నేతలు పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మాజీ ఎంపీ కవిత ఆమె నివాసంలో ఆవిష్కరించి ఆచార్య జయశంకర్‌కు నివాళి అర్పించారు. తెలంగాణ భవన్ లో మంత్రులు సత్యవతి రాథోడ్, నిరంజన్ రెడ్డి జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రవీంద్రభారతిలో జయశంకర్ చిత్రపటానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ నివాళులు అర్పించారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు జయశంకర్‌ను స్మరించుకున్నారు.
- https://youtu.be/KNS15VdAETQ