KTR Tweet About Agnipath : అగ్నిపథ్ పథకంపై ఓ వైపు దేశ వ్యాప్త నిరసనలు కొనసాగుతున్నాయి. లక్షల సంఖ్యలో నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. ఇదేం పట్టనట్లు కేంద్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. ఈ పథకం విషయంలో వెనక్కి తగ్గేదేలే అని రక్షణ శాఖ స్పష్టం చేసింది. నియామకాలు ఈ పథకం ద్వారానే సాగుతాయని క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఈ విషయంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు.
'అగ్నివీర్లను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తారట..!' - అగ్నిపథ్‌పై కేటీఆర్ ట్వీట్
KTR Tweet About Agnipath : త్రివిధ దళాల్లో నియామకం కోసం తెచ్చిన 'అగ్నిపథ్'కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయినా.. ఈ పథకం విషయంలో వెనక్కి తగ్గేది లేదని రక్షణశాఖ తేల్చి చెప్పింది. తాజాగా ఈ పథకంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. తనను అర్థం చేసుకోలేదని మోదీ యువతను నిందిస్తున్నారా అని ప్రశ్నించారు.
KTR Tweet About Agnipath
అగ్నిపథ్ పథకం తీరుపై కేటీఆర్ ట్వీట్ చేశారు. "ఈ పథకం వల్ల యువత.. డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, బార్బర్లు, వాషర్మెన్లు ఉపాధి పొందవచ్చని కేబినెట్ మంత్రి చెబుతున్నారు. అగ్నివీర్లను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తామని మరో భాజపా నాయకుడు మాట్లాడుతున్నారు. మోదీ జీ మిమ్మల్ని అర్థం చేసుకోలేదని యువతను నిందిస్తున్నారా..?" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.