ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పరిధిని రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాలకూ విస్తరించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు విస్తరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు.
హైదరాబాద్ టీ-హబ్లో జరిగిన ఫైబర్ గ్రిడ్ కార్పోరేషన్ బోర్డు సమావేశంలో పనుల పురోగతిని సమీక్షించారు. మిషన్ భగీరథ పనులు పూర్తైన గ్రామీణ ప్రాంతాల్లో టీ- ఫైబర్ పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఆగస్టు నాటికి ప్రతీ గ్రామానికి టీ-ఫైబర్ కనెక్టివిటీ ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అధికారులు వివరించారు.