Minister KTR America Tour : రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బృందం అమెరికా పర్యటనకు బయలుదేరింది. ఉదయం హైదరాబాద్ నుంచి వెళ్లిన మంత్రి బృందం.. లాస్‌ఏంజిల్స్, శాన్‌డియాగో, బోస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో పర్యటించనున్నారు. వారం రోజులకు పైగా కొనసాగనున్న పర్యటనలో ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అవుతారు.
Minister KTR America Tour : రాష్ట్రానికి పెట్టుబడుల కోసం అమెరికాకు కేటీఆర్ టీమ్ - కేటీఆర్ టీమ్ అమెరికా పర్యటన
Minister KTR America Tour : రాష్ట్రానికి పెట్టుబడుల వేటలో భాగంగా పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీరామారావు అమెరికా బయల్దేరి వెళ్లారు. వారం రోజుల పాటు సాగనున్న పర్యటనలో ఈ బృందం.. లాస్‌ఏంజిల్స్, శాన్‌డియాగో, సాన్‌హోజే, బోస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో పర్యటించనుంది. వివిధ కంపెనీల అధిపతులు, సీనియర్ ప్రతినిధులతో కేటీఆర్ బృందం సమావేశమవుతుంది.
Minister KTR America Tour
Minister KTR Team America Tour : గతంలో అమెరికాలో పర్యటించి పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకురావడంలో సఫలమయ్యామని ఈసారి కూడా రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించడంలో విజయం సాధిస్తామని.. కేటీఆర్ బృందం తెలిపింది. అమెరికా పర్యటనలో మంత్రితో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమలు, ఐటీ శాఖకు చెందిన పలు విభాగాల డైరెక్టర్లు ఉన్నారు.
- ఇదీ చదవండి :వడ్రంగి టాలెంట్‌కు కేటీఆర్ ఫిదా