KTR Tweet Today : ప్రధాన మంత్రి మోదీ, అదానిలను విమర్శిస్తూ ప్రశాంత్ భూషన్ చేసిన ట్వీట్‌ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష నాయకులను ఈడీ, సీబీఐ, ఐటీ టార్గెట్ చేయడం సర్వసాధారణమని అన్నారు. వారిపై దాడులూ సాధారణమని ట్వీటారు.
KTR Tweet Today : 'దానిపై ప్రధాని, అదానీలు స్పందించరు' - ktr tweet criticizing modi
KTR Tweet Today : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత కొద్దిరోజులుగా ట్విటర్ వేదికగా కేంద్ర సర్కార్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ, అదానిని విమర్శిస్తూ ప్రశాంత్ భూషన్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ పరోక్షంగా మరోసారి విమర్శించారు.
KTR Tweet Today
కానీ పవన విద్యుత్ కాంట్రాక్టులు అదానీకి ఇవ్వాలని శ్రీలంక ప్రభుత్వంపై మోదీ ఒత్తిడి తెస్తున్నారని శ్రీలంక ప్రభుత్వ అధికారులు చేసిన ఆరోపణలపై ప్రధాని, అదానీలెవరూ స్పందించరని ఎద్దేవా చేశారు. ఈ విషయంపై మీడియా కూడా నిశబ్ధం వహిస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీపై ఈడీ విచారణ కొనసాగుతున్న తరుణంలో ఈ ట్వీట్ చర్చనీయాంశమైంది.