KTR Tweet Today : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి భాజపాపై విరుచుకుపడ్డారు. ఇప్పటికే పలుమార్లు ట్విటర్ వేదికగా కేంద్ర సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలపైనా ప్రశ్నించారు. 8 ఏళ్లలో మోదీ సర్కార్ ఇచ్చిన హామీలు.. నెరవేర్చిన వాటి గురించి నిలదీశారు. తాజాగా మరోసారి కమలదళంపై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్.
KTR Tweet Today : భాజపా నేతలంతా సత్య హరిశ్చంద్రులా..? - కేటీఆర్ ట్వీట్ లేటెస్ట్
KTR Tweet Today : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా భాజపాపై మరోసారి విరుచుకుపడ్డారు. కమలం నేతలంతా సత్య హరిశ్చంద్రులు, ఆయన వారసులా అని ప్రశ్నించారు. 8 ఏళ్ల పాలనలో భాజపా నేతలు, వారి బంధువులపై ఎన్నిసార్లు ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరిగాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
KTR Tweet Today
భాజపా నేతలపై ఎన్ని ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరిగాయని కేటీఆర్ ప్రశ్నించారు. వారి బంధువులపై ఎన్నిసార్లు రైడ్స్ జరిగాయని అడిగారు. 8 ఏళ్ల పాలనలో ఎంతమందిపై దాడి చేసి.. ఎందరిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాషాయ నేతలంతా సత్య హరిశ్చంద్రుడు, ఆయన వారసుల్లా ఫీలవుతున్నారని ధ్వజమెత్తారు. జస్ట్ ఆస్కింగ్ అనే హాష్ ట్యాగ్‌తో ట్విటర్‌లో ఆయన ప్రశ్నలు సంధించారు.