తెలంగాణ

telangana

KTR On Data Science: 'డేటా సైన్స్‌కు గత ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యమివ్వలేదు'

By

Published : Mar 14, 2022, 4:41 PM IST

KTR On Data Science: ప్రభుత్వ రంగంలో విస్తృతమైన డేటా ఉందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. ఈ రంగానికున్న ప్రాధాన్యతను మనదేశం ఆలస్యంగా గుర్తించిందన్నారు. హైదరాబాద్​కు చెందిన ప్రముఖ డేటాసైన్స్ కంపెనీ గ్రామినర్ నూతన కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ktr
ktr

KTR On Data Science: దేశంలో డేటా సైన్స్‌కు గత ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యమివ్వలేదని.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ విమర్శించారు. ఈ కారణంగా డేటా సైన్స్‌ రంగంలో దేశం వెనకబడిందని చెప్పారు. ఇప్పుడిప్పుడే ఈ రంగం వేగం పుంజుకుంటోందని వివరించారు.

హైదరాబాద్​కు చెందిన ప్రముఖ డేటాసైన్స్ కంపెనీ గ్రామినర్ నూతన కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నానక్​రాం గూడాలోని వన్​ వెస్ట్​ బిల్డింగ్​లో గ్రామినర్ డేటా సెంటర్ ఏర్పాటు చేశారు. డేటా నిల్వ, అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుతం అతిపెద్ద మార్కెట్​గా అవతరిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రంగానికున్న ప్రాధాన్యతను మనదేశం ఆలస్యంగా గుర్తించిందన్నారు. డేటా సైన్స్, మానవ వనరుల ప్రోద్బలంతో సమగ్ర కుటుంబ సర్వే వంటి అతిపెద్ద ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఒక్కరోజులో పూర్తి చేయగలిగిందని కేటీఆర్ గుర్తు చేశారు.

గ్రామినర్​తో కలిసి పనిచేస్తాం..

పలు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, భాగస్వామ్యం కోసం డేటా సైన్స్ ఆవశ్యకత ఉందన్న మంత్రి.. ఇరిగేషన్, మున్సిపల్​ శాఖల్లోని పలు ప్రాజెక్టుల కోసం గ్రామినర్​తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. ఈమేరకు డేటా సైన్స్ నిర్వహణలో వ్యవసాయం, మొబిలిటీ, ఇండస్ట్రీ ఏరియాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు గ్రామినర్ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం గ్రామినర్​కు 250 మంది ఉద్యోగులు ఉండగా.. రాబోయే రెండేళ్లలో ఈ సంఖ్యను రెట్టింపు చేస్తామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు నవీన్ గట్టు వెల్లడించారు.

'ప్రభుత్వ రంగంలో విస్తృతమైన డేటా ఉంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే.. రెండేళ్ల క్రితం రూ.36 కోట్ల డేటా సెట్లను ప్రారంభించాం. ప్రస్తుతం ఇది చాలా ఎక్కువే ఉంటుంది. ప్రభుత్వంలో డేటాకు సంబంధించి ప్రజలకు ప్రయోజనం కల్పించే దిశలో విస్తృత అవకాశాలు ఉన్నాయి.'

- కేటీఆర్​, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి

KTR On Data Science: 'డేటా సైన్స్‌కు గత ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యమివ్వలేదు'

ఇదీచూడండి:'ప్రధాని మోదీ పవర్​ఫుల్ లీడర్​.. కానీ'

ABOUT THE AUTHOR

...view details