KTR At Diplomatic Outreach Event: ఎనిమిదేళ్లలో తెలంగాణ గొప్ప ప్రగతి సాధించిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 2014లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5.6 లక్షల కోట్లు ఉండగా.. 2022లో జీఎస్‌డీపీ రూ.11.55లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. ప్రధానితో సమావేశంలో ఈ విషయం గురించే చెప్పానని వెల్లడించారు. హైదరాబాద్ ఐటీ హబ్‌లో నిర్వహించిన డిప్లొమాటిక్ ఔట్‌రీచ్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
నంబర్‌వన్‌గా నిలవాలంటే ఆ మూడు సూత్రాలు పాటించాలన్న కేటీఆర్ - కేటీఆర్ లేటెస్ట్ న్యూస్
KTR At Diplomatic Outreach Event ప్రపంచ దేశాల్లో భారత్ నంబర్ వన్‌గా నిలవాలంటే ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్‌నెస్ అనే సూత్రాలు పాటించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. ఇప్పటికే భారత్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా నిలిచిందని అన్నారు. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంటే భారత్‌లోని రాష్ట్రాలన్ని తెలంగాణ వైపు చూస్తున్నాయని తెలిపారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ గొప్ప ప్రగతిని సాధించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మార్గదర్శకంగా నిలిచిందని చెప్పారు.

KTR Latest News: "ప్రపంచంలో భారత్ నంబర్ వన్‌లో ఉండాలంటే 3 సూత్రాలు పాటించాలి. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్‌నెస్ అనే సూత్రాలు పాటిస్తే మనమే నంబర్ వన్‌గా నిలుస్తాం. కాళేశ్వరం నిర్మాణంతో వ్యవసాయంలో ప్రగతి సాధించాం. వ్యవసాయంలో 19 శాతానికిపైగా వృద్ధిరేటు ఉంది సాధించాం. కేసీఆర్ పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలిపాం. ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తుంటే.. భారత్‌లోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. మన పథకాలను ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. వారంతా బయటకు విమర్శలు చేసినా.. వారి రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న పథకాలను చూస్తేనే తెలుస్తోంది. అవి తెలంగాణ నుంచి స్ఫూర్తి తీసుకొని అమలు చేస్తున్న పథకాలు అని" - కేటీఆర్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి