KTR At Nizam College Convocation : ఏడేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇవాళ ఆనందించే రోజు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడటం సరికాదని.. ఉద్యోగాలు సృష్టించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని సూచించారు. భారతీయులు ప్రపంచ స్థాయి కంపెనీలకు అధిపతులుగా ఉన్నారన్న కేటీఆర్.. ప్రపంచ స్థాయి కంపెనీలుగా భారత దేశ సంస్థలు ఎదగాలని ఆకాంక్షించారు. భారతీయ ఉత్పత్తులు అన్ని దేశాలకు వెళ్లేలా మనం ఎదగాలని పేర్కొన్నారు.
KTR About Job Notifications : హైదరాబాద్ నిజాం కళాశాల స్నాతకోత్సవానికి హాజరై మంత్రి కేటీఆర్.. కళాశాలలో బాలికల వసతిగృహాన్ని ప్రారంభించారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు పురస్కారాలు ప్రధానం చేశారు. నిజాం కళాశాలలో ఎనిమిదన్నర కోట్ల వ్యయంతో నిర్మించిన బాలికల వసతిగృహాన్ని ప్రారంభించారు. పూర్వ విద్యార్థిగా జ్ఞాపకాలను నెమరవేసుకున్న కేటీఆర్.. గతంలో ప్రిన్సిపాల్‌కు ఇచ్చిన హామీ మేరకు బాలికల హాస్టల్ నిర్మించామని తెలిపారు. ఇప్పుడు కాలేజీ అభివృద్ధికి రూ.15 కోట్లు కావాలని అడిగారని.. అది కూడా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. నేటి యువత కెరీర్ పరంగా చాలా సీరియస్‌గా ఉందని.. భవిష్యత్‌పై ఓ స్పష్టమైన అవగాహన కలిగి ఆ దిశలోనే విద్యార్థి స్థాయి నుంచి కృషి చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా అన్నారు.