తెలంగాణ

telangana

ETV Bharat / city

KTR On Forest restoration : 'దేశంలోని రాష్ట్రాలన్ని తెలంగాణను ఫాలో అవ్వాల్సిందే' - KTR about Forest conservation

KTR On Forest restoration : తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు సులభతర వాణిజ్యంలో అగ్రస్థానంలో రాణిస్తూనే.. మరోవైపు పచ్చదనం పెరుగుదలలోనూ నంబర్ వన్‌గా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి అడవుల సంరక్షణ పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. దేశంలోని మిగతా రాష్ట్రాలన్ని తెలంగాణ చూసి ఫాలో అవ్వాల్సిందేనని అన్నారు.

KTR On Forest restoration
KTR On Forest restoration

By

Published : Feb 25, 2022, 12:24 PM IST

KTR On Forest restoration : అడవుల పునరుద్ధరణలో తెలంగాణ ముందుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి అడవుల పునరుద్ధరణపై దృష్టి సారించామని చెప్పారు. అడవుల శాతాన్ని 33 శాతానికి పెంచేందుకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తోందని తెలిపారు. గ్రామీణ, పట్టణాభివృద్ధితో పాటు పచ్చదనం పెంపు కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించామని వెల్లడించారు.

అడవుల పునరుద్ధరణపై వర్క్‌షాప్..

KTR On Forestation : ఏటా వారం రోజులపాటు ప్రత్యేకంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని కేటీఆర్ వివరించారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని అన్నారు. సులభతర వాణిజ్య విభాగంలో రాష్ట్రానిదే నంబర్ వన్ స్థానమని తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన అడవుల నిర్వహణ, పునరుద్ధరణపై ప్రత్యేక వర్క్‌షాప్‌లో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు.

తెలంగాణ చేసి చూపిస్తోంది..

"ఏ దేశంలోనైనా ఆర్థికంగా ఎదుగుదల లేకపోతే.. కొత్త ఉద్యోగాల కల్పన జరగదు. ఉద్యోగాలు లేకపోతే.. దేశ ఆర్థిక పరిస్థితులు గతి తప్పుతాయి. అభివృద్ధికి పచ్చదనం.. పర్యావరణ పరిరక్షణ ఎప్పుడూ అడ్డుకాదు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే.. సులభతర వాణిజ్యంతో పాటు పచ్చదనం పెరుగుదల కూడా సాధ్యమవుతుంది. ఇప్పుడు తెలంగాణ చేస్తోంది అదే. రెండింటినీ బ్యాలెన్స్‌ చేస్తోంది. సులభతర వాణిజ్యంలో అగ్రస్థానంలో కొనసాగుతూనే.. పచ్చదనం పెంపుదలలోనూ నంబర్ వన్‌గా నిలుస్తోంది. పచ్చదనం పెరుగుదలలో తెలంగాణ రాష్ట్రం కృషి అద్భుతంగా ఉందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కూడా చెప్పింది."

- కేటీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి

పచ్చదనానికి ప్రాముఖ్యత..

KTR On Environmental Protection : "తెలంగాణ సర్కార్ పచ్చదనానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే గ్రీన్ కవర్‌లో పెరుగుదల ఉంది. గ్రామాల్లోనే కాకుండా.. పట్టణాలు, నగరాల్లోనూ పర్యావరణ పరిరక్షణ, ప్రకృతిని కాపాడుకునేందుకు అనేక రకాల కార్యక్రమాలు తీసుకువచ్చాం. ఓవైపు సులభతర వాణిజ్యాన్ని పెంచుకుంటూ.. మరోవైపు పచ్చదనం పెరుగుదలకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. కేంద్ర ప్రభుత్వం.. పర్యావరణ పరిరక్షణకు, అడవుల సంరక్షణకు మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టాలి. తెలంగాణలో చెట్లు నాటడమే కాదు.. నాటిన వాటిని సంరక్షించే బాధ్యతను సర్కార్ తీసుకుంది. గ్రామాలు, పురపాలికలు, పట్టణాలు, నగరాల్లో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులను వారి పోస్టుల నుంచి తొలగిస్తున్నాం. ఇలా కఠిన నిబంధనలు.. పక్కా ప్రణాళికలతో తెలంగాణలో పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నాం."

- కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

ప్రాక్టికల్‌గా ఆలోచించాలి..

KTR On Forest Conversation : ప్రతి రాష్ట్రం.. కేవలం సులభతర వాణిజ్యాన్ని పెంచుకోవడమే కాదు.. పచ్చదనంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కేటీఆర్ కోరారు. అలా చేసినప్పుడే.. రాబోయే తరాలకు పచ్చని ప్రకృతిని.. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించిన వాళ్లమవుతామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంతో.. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు.. అధికారుల సహకారంతో.. తెలంగాణలో 24 శాతం ఉన్న అడవుల శాతాన్ని 31 శాతానికి పెంచామని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. అటవీ శాఖ అధికారులు కేవలం కార్యాలయాల్లో ఉంటూ విధులు నిర్వర్తించడం కాకుండా.. ఫీల్డుకు వెళ్లి ప్రాక్టికల్‌గా పని చేయాలని సూచించారు.

దేశంలోని రాష్ట్రాలన్ని తెలంగాణను ఫాలో అవ్వాల్సిందే

ABOUT THE AUTHOR

...view details