KTR About Genome Valley : లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధికి హైదరాబాద్‌లో విస్తృత అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఫార్మా రంగ కంపెనీలకు జీనోమ్ వ్యాలీ గమ్యస్థానంగా మారిందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన బి-హబ్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిందని చెప్పారు. బి-హబ్ నిర్మాణంతో పాటు జీనోమ్ వ్యాలీ అభివృద్ధి కొనసాగుతుందని వెల్లడించారు. త్వరలో బి-హబ్ ప్రారంభించి.. బయోలాజికల్ పరిశోధనలకు తోడ్పాటు అందించబోతున్నామని మంత్రి ప్రకటించారు. జీనోమ్‌వ్యాలీని మరింత విస్తృతపరిచేలా.... మరో 400ఎకరాలు సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.
KTR At Genome Valley : హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో మంత్రి కేటీఆర్.. జాంప్ ఫార్మాను ప్రారంభించారు. కెనడా తర్వాత హైదరాబాద్‌లో ఈ కంపెనీ పెద్ద శాఖను ప్రారంభించిందని కేటీఆర్ తెలిపారు. అహ్మదాబాద్‌ను పరిశీలించిన తర్వాత ఈ కంపెనీ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నారని వెల్లడించారు. భాగ్యనగరాన్ని ఎంచుకున్నందుకు జాంప్ ఫార్మా కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. అన్నిరకాలుగా ఫార్మా సంస్థలకు అణువుగా ఉన్న జీనోమ్ వ్యాలీలో... యూనిట్ల స్థాపనకు ఫార్మా కంపెనీలు ముందుకు రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.