కరోనా విషయంలో తెలంగాణ సురక్షితంగా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయన్నారు. పక్క రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శితో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. కేసులు పెరుగుతున్నందున ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఒకవేళ కేసులు పెరిగినా వైద్య సేవలు అందించేలా అన్ని ఆస్పత్రులను సిద్ధంగా ఉంచాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పూర్తిస్థాయిలో గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిని, గాంధీలో కొవిడ్ వార్డుల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్‌లు, ఔషధాలు, ఇంజక్షన్లు, టాబ్లెట్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని మంత్రి ఈటల ఆదేశించారు.