తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణ పత్తికి అంతర్జాతీయ బ్రాండ్‌ ఇమేజ్ తీసుకురావాలి: కేసీఆర్​ - పత్తిపై కేసీఆర్ సమీక్ష

kcr
kcr

By

Published : Dec 7, 2020, 6:49 PM IST

Updated : Dec 7, 2020, 7:48 PM IST

18:46 December 07

తెలంగాణ పత్తికి అంతర్జాతీయ బ్రాండ్‌ ఇమేజ్ తీసుకురావాలి: కేసీఆర్​

అత్యంత నాణ్యతతో కూడిన రాష్ట్ర పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ వచ్చేలా బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణపై మంత్రి నిరంజన్ రెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం... పత్తి సాగు, మార్కెటింగ్​పై సూచనలు చేశారు. రాష్ట్రంలో పండే పత్తి దేశంలో కెల్లా అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందిందని... ప్రపంచంలోకెల్లా అత్యంత నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని అన్నారు. ఇక్కడి దూది పింజ పొడవు దేశంలో కెల్లా అత్యంత పొడవుగా వస్తుందని, గట్టితనం కూడా ఎక్కువేనని తెలిపారు.  

నిపుణులతో సదస్సు నిర్వహించాలి

తెలంగాణ పత్తికున్న విశిష్ట లక్షణాలను గుర్తించి, వాటిని ప్రచారం చేసేందుకు అవసరమైన వ్యూహం రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిపుణులతో ఓ సదస్సు నిర్వహించాలని చెప్పారు. అంతర్జాతీయంగా మరింత డిమాండ్ వచ్చేలా పత్తిశుద్ధి, ప్యాకింగ్ తదితరాల్లో రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని తెలిపారు. 60 లక్షల ఎకరాలతో దేశంలోనే ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. సాగునీటి ద్వారా సాగు చేసే భూముల్లో పత్తిపంట మరింత బాగా వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులతో సాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చినందున కాల్వల కింద పత్తిని సాగు చేస్తే మరింత లాభసాటిగా ఉంటుందన్నారు.  

కొత్త వంగడాలు వచ్చాయి

పత్తికి మంచి మార్కెట్ వచ్చేలా ప్రభుత్వం కూడా అవసరమైన చర్యలు తీసుకుంది. జిన్నింగ్ మిల్లుల సంఖ్యను 60 నుంచి 300 కు పెంచేలా చర్యలు తీసుకున్నాం. పత్తి ఎక్కువగా పండే ప్రాంతాల్లో జిన్నింగ్ మిల్లులను నెలకొల్పేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశాం. పత్తి సాగులో అనేక కొత్త పద్ధతులు, కొత్త వంగడాలు వచ్చాయి. ఒకేసారి పంట వచ్చే విత్తనాలు వస్తున్నాయని, వాటిని రాష్ట్రంలోనూ పండించాలి. లాభసాటి పంటలనే పండించాలన్న ప్రభుత్వ సూచనలను రైతులు పాటించి నియంత్రిత పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం.  

-కేసీఆర్

ఆయిల్ ఫామ్ విస్తీర్ణాన్ని పెంచాలి

మార్కెట్లో పత్తికి, నూనె గింజలకు, పప్పులకు మంచి డిమాండ్ ఉందని  కేసీఆర్​ తెలిపారు. కూరగాయలకు కూడా మంచి ధర వస్తున్నందున వాటిని ఎక్కువగా పండించాలన్నారు. కందుల విస్తీర్ణాన్ని 20 లక్షలు, ఆయిల్ పామ్ విస్తీర్ణాన్ని ఎనిమిది లక్షల ఎకరాలకు పెంచాలని ముఖ్యమంత్రి తెలిపారు.  

ఇదీ చదవండి :ఈనెల 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు సాయం: కేసీఆర్​

Last Updated : Dec 7, 2020, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details