తెలంగాణ

telangana

ETV Bharat / city

ODF PLUS Villages: ఓడీఎఫ్​ ప్లస్​ హోదా గ్రామాల్లో దేశంలోనే తెలంగాణ టాప్​

స్వచ్ఛభారత్​లో భాగంగా బహిర్భూమి రహితంతోపాటు ఇతర ప్రమాణాలు పాటిస్తున్న గ్రామాలకు.... కేంద్ర ప్రభుత్వం ఓడీఎఫ్​ ప్లస్ హోదా ఇస్తోంది. దేశవ్యాప్తంగా 17 వేల 684 గ్రామాలకు ఇప్పటివరకు ఓడీఎఫ్​ ప్లస్ హోదా లభించగా... అందులో తెలంగాణకు చెందిన గ్రామాలే ఏకంగా 6 వేల 537 ఉన్నాయి.

ODF PLUS Villages
ODF PLUS Villages

By

Published : Dec 25, 2021, 5:36 AM IST

పచ్చదనం, పరిశుభ్రతతో పల్లెల రూపురేఖలు మారుస్తోన్న రాష్ట్రం... మరో ఘనతను సాధించింది. ఓడీఎఫ్​ ప్లస్ హోదా పొందిన గ్రామాల్లో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ చాలా ముందంజలో ఉంది. స్వచ్ఛభారత్​లో భాగంగా బహిర్భూమి రహితంతోపాటు ఇతర ప్రమాణాలు పాటిస్తున్న గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఓడీఎఫ్​ ప్లస్ హోదా ఇస్తోంది.

దేశవ్యాప్తంగా 17 వేల 684 గ్రామాలకు ఇప్పటివరకు ఓడీఎఫ్​ ప్లస్ హోదా లభించగా... అందులో తెలంగాణకు చెందిన గ్రామాలే ఏకంగా 6 వేల 537 ఉన్నాయి. ఓడీఎఫ్​ ప్లస్ హోదా పొందిన మొత్తం గ్రామాల్లో మూడో వంతుకుపైగా రాష్ట్రానికి చెందిన గ్రామాలే ఉండడం విశేషం. 3 వేల 623 గ్రామాలతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది.

ఇదీచూడండి:కట్టెల పొయ్యి పెట్టి ఆట మొదలుపెట్టారు.. నీళ్ల కోసం వెళ్లిన ఆ ముగ్గురు చిన్నారులు..

ABOUT THE AUTHOR

...view details